పక్షులు వలసపోవటం మనందరికీ తెలుసు. స్కాండినేవి యాకి చెందిన ఛాపించెస్ అనే ఆడపక్షి వేరే ప్రాంతానికి వలసపోతుంది. కానీ మగపక్షి అక్కడే ఉంటుంది. ఇక పెద్ద పక్షులు ‘వి ఆకారంలో గుంపులుగా ఎగురుతాయి. గుడు ్లపెట్టి ఏడాదికల్లా మళ్లీ అదే ప్రాంతానికి వచ్చేవి కూడా ఉన్నాయి. 2 వేల కి.మీ. ఎగిరి తిరిగి అదే రోజు ముంబై చేరిందిట గ్రే వాగ్ టేల్ అనే పక్షి. ముందుగా మగపక్షులు వసంతకాలంలో వలసపోతాయి. ఆ తర్వాత ఆడ పక్షులు గుడ్లు పెట్టడంకోసం మగవాటిని చేరుతాయి.
ఆకురాలు కాలంలో చిన్న పక్షులు వెళ్లేదారిన, మగ,ఆడపక్షులు వెం బడించడం ఇంకో విశేషం. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వలసపోయే పక్షుల్ని కాపాడటం కోసం అంతర్జాతీయంగా కృషి జరుగుతోంది. దిమైగ్రేటరీ బర్డ్ ట్రీటీయాక్టు 1918 (యు.ఎస్)ఆఫ్రికన్ యురేషి యన్ మైగ్రేటరీ వాటర్ బర్డ్స్ అగ్రిమెంట్ ఇలాంటి అంతర్జాతీయ ఒప్పందాలే. గుత్తులు గుత్తులుగా రంగురంగుల సన్నని పూలు, గరుకు ఆకు లతో అడవి మొక్కలా కనపడే దానిపేరు లాన్‌టనా. ఇది మనకి మేలేచేస్తుంది. దీని కాయలు నల్లగా ఉంటాయి. రకరకాల రోగాల్ని నివారిస్తుంది. పేపరు గుజ్జుగా, ఎరువ్ఞ గా, పైరుల్ని కాపాడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తోంది.
ఎంతటి వేడి ప్రదేశంలో కూడా ఎంచ క్కా పుష్పిస్తుంది. దీని పుట్టిల్లు అమెరికా. 1809లో మనదేశం లో కలకత్తా బొటానికల్‌గార్డెన్‌లో నాటారు. వింత వాసనతో, గరుకు ఆకులతో అందమైన గుత్తులతో ఉంటుంది. రక రకాల పక్షు లు, కీటకాలు దీని మకరందాన్ని గ్రోలుతాయి. కొండవాలు ప్రాంతాల్లో గుబురుగా పెరిగి అడవి జంతువ్ఞ లకి ఆశ్రయం కల్పిస్తోంది. నేలని సారవంతం గావిస్తుంది. ఫర్నిచర్‌కి దీని కట్టెనే వాడతారు. దుస్తుల్ని వేలాడదీసే హ్యాంగర్స్‌ని దీని కర్రతోనే చేస్తారు. జలుబు, జ్వరం, ఇన్‌ఫ్లుయెంజా, కడుపు నొప్పి, ఆస్త్మాకి వాడతారు. ఇది గాయాలకి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది. దోమల్ని నివారిస్తుంది. ఒకప్పుడు దీన్ని విషపు కలుపుమొక్క అని తెగ నరికేసేవాడు. కానీ నేడు అమృత సమానమని తెలుసుకుని దీన్ని ప్రత్యేకంగా పెంచుతున్నారు.