Type Here to Get Search Results !

అమ్మ భాష కమ్మని భాష‌ తెలుగు.

0
*******
నదుల వయ్యారాలను
పదాల వంపులతో
గలగల పారించే
కమ్మని భాష‌ తెలుగు.

పడచు అందాలను
పరవశించే  పదాలతో,
చందనాలు అద్దిన
చందస్సుల భాష తెలుగు.

ప్రకృతి అందాలను
మురిపించే పదబంధాలతో
అల్లారుముద్దుగా అలరించె
అలంకారాల భాష తెలుగు.

సమాజ సారాంశాన్ని
సహజ పదవిన్యాసాలతో
సాంత్వన చేకూర్చే
సమసాల భాష తెలుగు.

ఉరుకుల పరుగుల బ్రతుకుల్లో
పరిపరివిధాల పరమార్ధాన్ని
పరిపూర్ణంగా బోధనగావించె
పర్యాయపదాల భాష తెలుగు.

పదహారణాల తెలుగందాలను
మైమరిపించి మెలికతిప్పించే
రసరాగాల సరసగీతాల
పద్యాలున్న  భాష తెలుగు.

పండుగ శోభలను
పంచభక్షపరమాన్నాలుగా
తెలుగుజాతికి అందించె
సంస్కృతీ భాష తెలుగు.

ఎన్ని యాసలున్నా
అలసట నివ్వని ,
ఎన్ని భాషలున్నా
మరపురాని
ఉగ్గుపాలనాటి అమ్మ భాషనే
అమృత భాష.
అదే మన తెలుగు భాష.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages