Type Here to Get Search Results !

పులి పిల్లి కాదు,పిల్లి పులి కాదు

0

పులి పిల్లి కాదు,పిల్లి పులి కాదు. మన భావనే అసలైన రూపం! ఒక పులి అద్దంలో తనను పిల్లిగా చూసినపుడు, అది తినే శక్తిని కోల్పోతుంది కానీ,

*_ఒక పిల్లి తనను పులిలా ఊహించి నప్పుడు,అది తిరిగే ప్రతి అడుగు గర్జనవలె ఉంటుంది..నిజమైన విలువ మనం మనల్ని ఎలా చూస్తామనేదే!_

ఇతరుల కన్నా కాదు..మన మనస్సే నిదర్శనం! మీరు నిజంగా ఎవరు అన్నదానికంటే...మీరు మీ గురించి ఏమను కుంటున్నారు..?అన్నదే జీవితాన్ని రూపుదిద్దుతుంది.

"అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మనే అనే భావనలోనే సృష్టి ఉజ్వలత."అదే భావనను వేమన పద్యంలో ఇలా చెప్పాడు .."తానే తాను గౌరవించుకున్నవాడే నిజంగా గౌరవపడతాడు."_

 

ప్రపంచం మనపై వేసే ముసుగును పారద్రోలే ప్రయత్నమే నిజమైన మజా..కొందరు మిమ్మల్ని చిన్నవాళ్లుగా చూస్తారు..కొందరు మిమ్మల్ని ఎక్కువగా భావిస్తారు కానీ,

మీరు మీలోని అద్భుతాన్ని చూసుకోగలిగితే మిమ్మల్ని మీరు ఎలా చూపించు కోగలిగేలా చేసుకునేదే ఆత్మవిశ్వాసం.అదే నిజమైన విజయబీజం!

కాబట్టి ఇతరుల అభిప్రాయం తాత్కాలిక ప్రతిబింబం.కానీ మీ స్వీయ భావన శాశ్వత ప్రభావం...

ఆఖరుగా చిన్న మాట..._

పులి పిల్లిలా ఉన్నా సరే,మీరు పులిలా భావించండి..అదే నిజమైన జీవన ధైర్యం


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages