ఎద్దునెక్కె శివుడు, గ్రద్దనెక్కె
విష్ణు
హంసనెక్కె బ్రహ్మ అందముగను
బద్దకంపు మొద్దు బల్లపై నెక్కెరా
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: శివుడు ఎద్దున, విష్ణువు
గ్రద్దపై, బ్రహ్మ హంసపై కూర్చున్నట్లు, బద్దకం కలిగినవారు మంచంపై కూర్చుని, అశ్రద్ధ చేయడం
వ్యర్థమని చెబుతోంది.