కాంతి (LightRay) - తరంగమ?కణమా ? అంటే చెప్పడము
కష్టమే ! ఒక్కొక్క సారి ప్రశ్న కు ఎదురు ప్రశ్నే జవాబునిస్తుంది . ఉదాహరణకి
నానేనికున్నది బొమ్మా లేదా బొరుసా? అంటే ఏం చెబుతాం ?.
కాంతికి కుడా నాణేనికిలాగే కణ(Corpuscular) స్వభావము
, తరంగ (Wave)స్వభావము సంయుక్తం గా
అవిభాజ్యం గా ఉంటాయి . ఎలాగైతే నేల మీద పడేసిన నాణెపు రెండు పక్కలు (బొమ్మ ,
బొరుసు) ఒకే సారి ఎలా చూడ లేమో ... ఒకే ప్రయోగం ద్వారా కాంతికున్న
తరంగ స్వభావాన్ని , కణ స్వభావాన్ని ఏకకాలం లో పరిశీలించాలేము
.
కాంతి వక్రీభవనం(Refraction) , వివర్తనం (Disfraction) , వ్యతికరణం (Interference),
ద్రువనం (Polarisation) అనే ధర్మాలను కలిగి
ఉంటుంది . కాంతి కున్న తరంగ స్వభావానికి ఈ ద్రుగ్విషయాలు కారణము . కాంతి
విద్యుత్ఫలితము (PhotoElectricEffect), కాంఫ్తాన్ ఫలితము ,
కాంతి రసాయనిక చర్యలు (PhotoChemical phinomena) , కృష్ణ వస్తు వికిరణం (BlackBodyRadiation) ఉద్గార
వర్ణ పటాలు (EmissionSpectra) వంటి ప్రయోగ ఫలితాలు , పరిశీలనలు , కాంతి కున్న కనస్వభావాన్ని సూచిస్తాయి.
ప్రయోగ పూర్వకం గా రెండు లక్షణాలు ఏక సమయం లో ఉండడం వల్ల కాంతికి కణ-తరంగ ద్వంద్వ
స్వభావం (WaveParticleDuality) ఉందంటారు.