మదము గురియుచున్న మత్తేభములపైన
సింహశిశువు దుమికి చీల్చివైచు
వరపరాక్రములకు వయసుతో పనిలేదు
లలితసుగుణజాల! తెలుగుబాల!!
భావం: ఒక చిన్న సింహపు పిల్ల కూడా
పెద్ద ఏనుగుని ఎదుర్కొనే ధైర్యాన్ని కలిగి ఉంటుంది. అలా వయస్సు, పరిమాణం
కంటే ఒక మనిషిలోని ధైర్యమే అతన్ని గొప్పతనం చాటుతుంది.