*కర్మయోగం* అంటే మనం చేసే కర్మలతో మనం పూర్తిగా ఏకమై ఉండడం.
చదువుకుంటున్నప్పుడు చదువుతోనే ఏకమై ఉండాలి ....
మరి భోజనం చేసేటప్పుడు ఆ ప్రక్రియతోనే ఏకమై ఉండాలి. ఏదైనా నేర్చుకునేతప్పుడు నేర్చుకునే ప్రక్రియపై ఏకమై ....
ఆ యా క్రియలతో , కర్మలతో పూర్తిగా లీనమై వుండటమే *"కర్మయోగం"*.
*"యోగః కర్మసు కౌశలం"* అని *భగవద్గీత లో శ్రీకృష్ణపరమాత్మ* అన్నారు కనుక... *చేసే కర్మలలో ఏకమై...మన పూర్తి కౌశల్యాన్ని చూపించడమే *"కర్మయోగం"*.