* * * ** * * *
చిత్తూరు జిల్లాకు ప్రత్యేకమైన చరిత్ర వుంది . ఉమ్మడి మదరాసు రాష్ర్టంలో ఉత్తర ఆర్కాడ్ జిల్లా లోని చిత్తూరు , పలమనేరు ,చంద్రగిరి , తాలూకాలు మరియు పుంగనూరు , శ్రీ కాళ హస్తి , బంగారు పాళెం వంటి జమీనులు , కార్వేటి నగరం సంస్థానం లను కలిపి 1911 ఏప్రిల్ 1 వ తేదీన చిత్తూరు జిల్లాను ఏర్పాటు చేసారు*
*ఆ తర్వాత 1928 లో ఉత్తర ఆర్కాడ్ జిల్లా నుంచి కంగుంది తాలూకాను చిత్తూరు జిల్లాలో కలిపారు .1950 లో మైసూరు రాష్ట్రం నుండి 8 గ్రామాలను పలమనేరు తాలూకాలో చేర్చారు* .
*1960 లో చిత్తూరు జిల్లా నుంచి తిరుత్తణి తాలూకాను విడదీసి తమిళనాడు లో చేర్చారు .తమిళనాడు నుంచి కొన్ని గ్రామాలను ఆంధ్ర ప్రదేశ్ కు చేర్చి కొత్తగా సత్యవేడు తాలూకాను ఏర్పరిచి , దానిని చిత్తూరు జిల్లా లో కలిపారు* .
*ఇలా తమిళ నాడు నుంచి కొన్ని గ్రామాలు* , *కడప , నెల్లూరు నుంచి కొన్ని ప్రాంతాలను కలిపి చిత్తూరు*
*జిల్లాగా ఏర్పాటు చేయడం వల్ల రకరకాల ప్రాంతాల వ్యక్తులు*
*ఒకటి అయ్యారు* .
*కాలక్రమంలో 11 తాలూకాలను 15 గా మార్చి 20 పంచాయితీ సమితీలుగా ఏర్పాటు చేసారు .మండలాల పద్ధతి వచ్చాక జిల్లాను 66 మండలాలుగా చేసారు* . *3 రెవెన్యూ డివిజన్లు (చిత్తూరు , తిరుపతి , మదన పల్లె ) ఏర్పాటు అయ్యాయి* .
*చిత్తూరు జిల్లా విస్తీర్ణం 15,152 చదరపు కిలో మీటర్లు .ఈ జిల్లాలో రకరకాల ఆచార వ్యవహారాలు , వివిధ భాషలు కనిపిస్తాయి . జిల్లాలో ఎక్కువ శాతం ప్రజల భాష తెలుగే*
. *అయినప్పటికీ శ్రీ కాళ హస్తి ఎగువ ప్రాంతాల్లో నెల్లూరు జిల్లా పద్ధతులు ; దిగువన సత్యవేడు , నగరి , పుత్తూరు , చిత్తూరు ప్రాంతాలలో తమిళ ప్రభావం ; మదన పల్లె , పలమనేరు , కుప్పం ప్రాంతాలలో కర్ణాటక వాతావరణం* _ *ఇలా జిల్లాలో రకరకాల పద్ధతులు , సాంప్రదాయాలకు చిత్తూరు జిల్లా స్థానంగా ఉంది* .
*చిత్తూరు జిల్లాను ముఖ్యంగా తూర్పు , పడమటి తాలూకాలను విభజించి చెప్పుకుంటారు* .
*పడమటి ప్రాంతం సముద్ర మట్టానికి బాగా ఎత్తులో వుండడం వల్ల వేసవిలో వాతావరణం చల్లగా* , *ఆహ్లాదకరంగా ఉంటుంది* . *తూర్పు ప్రాంతం సముద్ర మట్టానికి దగ్గరగా ఉండదం వల్ల వేసవిలో ఎండలు విపరీతంగా ఉంటాయి*. *అయితే తూర్పు ప్రాంతంలో వర్షపాతం ఎక్కువ అని చెప్పుకోవచ్చు*
*రాయల సీమ లో ఈ జిల్లాలోనే మొదటి సారిగా బిసెంట్ కళాశాల లో ఉన్నత విద్యను ప్రారంభించారు ప్రఖ్యాత తత్త్వవేత్త జిడ్డు కృష్ణ మూర్తి రుషి వాలీ లో పాఠశాలను ప్రారంభించారు . రవీంద్ర నాథ్ ఠాగూర్ మదన పల్లె లోనే మన జతీయ గీతాన్ని ( జన గణ మన ) ఇంగ్లీషు లోనికి అనువాదం చేసారు .మదన పల్లె లోని టి.బి శానిటోరియం ప్రపంచ ప్రసిద్ధి చెందింది .పుత్తూరు లో ఎముకల వైద్యం గురించి అందరికీ తెలుసు* .
*ఈ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన విద్యావేత్తలు , స్వాతంత్ర్య యోధులు , రాజకీయ నాయకులు , కవులు పలువురు వున్నారు . ధూర్జటి ( శ్రీ కాళ హస్తి ) , తరిగొండ వెంగమాంబ ( వాయల్పాడు ) , కవి చౌడప్ప ( పుంగనూరు ) ఈ జిల్లాకు ఘనత తెచ్చారు* .
*చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలకు , విహార కేంద్రాలకు పెట్టింది పేరు . అన్ని సంప్రదాయాలకు , కళలకు ఆట పట్టు చిత్తూరు జిల్లా*.
*ప్రకృతి సౌందర్యానికి , దైవ చింతనకు నిలయమైన చిత్తూరు జిల్లాలో చూడదగిన స్థలాలకు కొదువ లేదు . మన దేశానికే కిరీటం లాంటిది తిరుపతి పుణ్య క్షేత్రం . క్రీ.శ. 10 వ శతాబ్ధం నుండి ఈపవిత్ర క్షేత్రానికి విలువ పెరిగింది . శ్రీ కృష్ణ దేవరాయలు*
*ఈ దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశాడు*
*తిరుపతికి 5 కి.మీ దూరంలో స్వర్ణముఖీ నదీ ఉత్తర తీరాన తిరుచానూరు వుంది* . *ఇక్కడ పద్మావతీ దేవి ఆలయం వుంది* . *శుక మహర్షి ఇక్కడ నది ఒడ్డున తపస్సు చేసినట్లు స్థల పురాణంలో చెప్పబడింది*
*జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రం శ్రీ కాళ హస్తి . త్రి లింగాలలోను , పంచ భూత లింగాలలోను శ్రీ కాళ హస్తి లింగం ఒకటి .దీనిని వాయు లింగం అంటారు* *అద్భుతం అనిపించే శిల్ప కళ కలిగిన ఈదేవాలయాన్ని* *స్థానిక యాదవ రాజులు అభివృద్ధి* *చేయగా , శ్రీ కృష్ణ దేవ రాయలు నూరు స్తంభాల మండపం* , *గాలి గోపురం కట్టించాడు .ఈయన ఆస్థాన కవులలో ఒకడైన ధూర్జటి ఈ దేవుని మహత్యాన్ని కీర్తిస్తూ శ్రీ కాళహశ్తీశ్వర శతకాన్ని రచించాడు*
*చంద్ర గిరి లోని ఎత్తైన కోట , రాణిమహల్ , రాజ దర్బార్ , గుర్రపు శాల , కోనేరు ఇప్పటికీ అందరిని ఆకర్సిస్తున్నాయి . క్రీ.శ .1000 లో యాదవ రాజు ఇమ్మడి*
*నరసింహ రాయలు ఈ మహా దుర్గాన్ని నిర్మించాడు* *ఇక్కడ*
*పురావస్తు ప్రదర్శన శాల కూడా ఉంది*
*భాకరా పేట సమీపం లోని తల కోన ప్రకృతి సౌందర్యంలో చిత్తూరు జిల్లాకే తలమానికం .దట్టమైన అడవులు , గల గల పారే సెలయేరు , వంద అడుగుల ఎత్తు నుండి ఆగకుండా దూకే జలపాతం , వీటి మధ్య అలరారుతున్న సిద్ధేశ్వర స్వామి వారి దేవాలయం _ చూచి తీరవలసిన అందాలు .చలన చిత్ర నిర్మాతల్ని విశేషంగా ఆకర్సించిన ఈప్రాంతంలో ఎన్నో సినిమా షూటింగులు జరుగుతుంటాయి* .
*తిరుపతికి 36 కి.మీ దూరంలో* *నారయణవనం వుంది .ఈ ప్రాంతాన్ని పద్మావతీ దేవి తండ్రి*
*అయిన ఆకాశ రాజు పరిపాలించేవాడట. శ్రీ వేంకటేశ్వర స్వామి , పద్మావతీ దేవి పవిత్రవివాహం ఇక్కడేజరిగింది*.
*ఇక్కడ కళ్యాణ వేంకటేశ్వర స్వామి దేవాలయం చూడదగినది*
*నాగలాపురం* , *శ్రీ వేద నారాయణ*
*స్వామి ఆలయంతో పవిత్రమైన పుణ్య భూమి*. *పాపా నాయుడు పేట సమీపంలో గల గుడిమల్లంలో ప్రసిద్ధ శ్రీ పరమేశ్వరాలయం ప్రాచీన శిల్ప సంపదతో అలరారు చున్నది*.
*సోమ పాలెం లో శ్రీ చెన్నకేశవ దేవాలయం మండపాలు , మనోహర శిల్పాలు , ఏబది అడుగుల ఏక శిలా ధ్వజ స్తంభం తో కనువిందు చేస్తున్నది*.
*బంగారుపాళెం , పలమనేరు మధ్య జాతీయ రహదారి పక్కనే వున్న మొగిలి లో ప్రాచీన కాలం నుండి ప్రఖ్యాతి చెందిన మొగిలీశ్వర ఆలయం కనుల పండుగ చేస్తున్నది*. *ఇక్కడ నంది విగ్రహం నోటి నుండి సర్వ కాలాల లోను ఎడతెగని ధారగా నీరు పడుతూ వుంటుంది*.
*మదనపల్లి సమీపంలో సముద్ర మట్టానికి 1266 మీటర్ల ఎత్తున ఉన్న మరో అందమైన ప్రదేశం హార్సిలీ కొండలు . ఇక్కడ నిర్మించిన గవర్నర్ బంగళా , గవర్నరుకు వేసవి* విడిది .ఎత్తైన కొండలు , లోతైన *లోయలు , పచ్చని చెట్లు , రివ్వున వీచే చల్లని గాలులతో ఇక్కడి వాతావరణం మనసును దోచేస్తుంది ఎవరికైనా*.
*జిల్లాలో తలకోన , కైలాసనాథ కోన , సదాశివ కోన , దుముకురాళ్ళ మొదలగు జలపాతాలు , అక్కడే వెలసిన శివాలయాలతో సందర్శకులకు కనువిందు చేస్తున్నాయి*.
*చిత్తూరు నాగయ్య , అనంత శయనం అయ్యంగార్ , కట్టమంచి రామలింగా రెడ్డి* , *చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళె* , *ఆర్.బి.రామకృష్ణ రాజు*,
*శంకరంబాడి సుందరాచారి , జిడ్డు కృష్ణమూర్తి* , *సర్వేపల్లి రాధాకృష్ణన్ ...ఎందరో...ఇంకెందరో...చిత్తూరు సీమకు చెందిన ఆణి ముత్యాలు , మేలిమి రత్నాలు* .
*చిత్తూరు జిల్లాలో ముఖ్యవృత్తి వ్యవసాయం.రాష్ట్రం మొత్తంలో బావుల కింద అ సాగు అవుతున్న భూముల్లొ అధిక శాతం మన జిల్లాదే. విధ్యుచ్చక్తి*
*తో నడిచే పంపు సెట్లు కూడా ఇక్కడే ఎక్కువ.చిన్న చిన్న పరిశ్రమలు ఉన్నాయి*.
*ఇన్ని వున్నా చిత్తూరు జిల్లాలో సగటు మనిషి ఎదగలేక పోతున్నాడు .ఉన్న కొద్దిపాటి పరిశ్రమలు , వ్యవసాయ పరిస్థితులు ప్రజల మనుగడకు సరిపోవడం లేదు .వేలాది మంది బ్రతుకు తెరువు కోసం ప్రక్క రాష్ర్టాలకు వలస పోతున్నారు .దీనిని అరికట్టాలంటే ఇక్కడ మరిన్ని ఉపాధి సౌకర్యాలు కలుగజేయాలి.ఇక్కడి ప్రజలకు ఇక్కడే బ్రతుకుతెరువు లభించే విధంగా మరిన్ని పరిశ్రమలు , ప్రాజెక్టులు నెలకొల్పాలి .నిరుపయోగంగా పడివున్న వేలాది హెక్టార్ల బంజరు భూముల్ని*
*పంట పొలాలుగా మార్చాలి . వ్యవసాయ ఉత్పత్తులను పెంచాలి*
*ప్రభుత్వం ఈ చర్యలన్నీ చేపడితే , చిత్తూరు జిల్లా ఆదర్శవంతంగా అడుగు ముందుకు వేస్తుంది*