- విజయవాడ నుంచి, అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది
కరకట్ట మీదుగా వెళితే, 'నడకుదురు' గ్రామమ
- ఆ గ్రామమునకు గల పురాతనమైన పేరు "నరకాసుర సంహార క్షేత్రము".
- ఆ గ్రామము పేరు, కాలక్రమేణా మారుతూ,
నరకొత్తూరు, తర్వాత 'నడకుదురు
గా మారింది.
- ఇక్కడ, మహా సుందరమైన పచ్చని అరటి తోటల మధ్యన,
"శ్రీ పృథ్వీశ్వరాలయముంది".
- సత్యభామాదేవి.. సాక్షాత్తు భూదేవి. నరకాసురుని సంహరించిన తర్వాత, అమ్మవారు ఈశ్వర ప్రతిష్ట చేసిందని స్థల పురాణము.
- 'పృథ్వి' అంటే భూదేవి, సత్యభామ.
- ఆ ఆలయము వద్దనే, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము
కూడా వున్నది.
- నరకాసురుని ఇచ్చట సంహరించిన తర్వాత, మొదట
మొదటగా నరక చతుర్దశి, దీపావళి జరుపుకున్నారు.
- నరకాసురుడు, స్వర్గలోకమునుంచి తెచ్చి 'పాటలీవృక్షమును' ఈ ఆలయము వద్ద నాటాడు.
- మన భారతదేశంలోనే గల ఏకైక వృక్షమిది. 5000 సంవత్సరములనాటిది.
ఈ వృక్షమును ఇప్పటికీ మనము దర్శించుకోవచ్చు.
- బిడ్డలు లేని వారు, ఈ చెట్టుకు 'వుయ్యాల' కడితే, తప్పక సంతానవతులవుతారు.
- విజయవాడ నుంచి, అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది
కరకట్ట మీదుగా వెళితే, సుమారు 50 కి.మీ. దూరంలో ఈ 'నడకుదురు'
గ్రామము చేరుకోవచ్చు.
దీపావళి' ప్రప్రధమముగా జరుపుకున్న స్థలము, ఆంధ్రదేశము లోనే వున్నది
నవంబర్ 28, 2024
0
Tags