Type Here to Get Search Results !

కాళిదాసు గర్వభంగం

👉మండు వేసవిలో ఒకరోజు మహాకవి కాళిదాసు పరదేశానికి బయల్దేరాడు.

👉మిట్ట మధ్యాహ్న సమయానికి ఒక కుగ్రామానికి చేరుకున్నాడు. బాగా దాహం వేయడంతో ఓ గుడిసె దగ్గరికి నీళ్ల కోసం వెళ్తాడు.

👉ఓ బాలిక నీటి కుండతో గుడిసెలోకి వెళ్తుంటుంది. ఆమెను చూసి... *‘బాలికా! నాకు దాహంగా ఉంది. నీళ్లు ఇవ్వమ’ని* అడిగాడు కాళిదాసు.

👉అప్పుడా బాలిక... ‘మీ రెవరో నాకు తెలియదు.. నీళ్లు ఎలా ఇచ్చేద’ని* బదులిచ్చింది. కాళిదాసు:

👉నేను ఎవరో తెలియక పోవడం ఏంటి? పెద్ద పండితుడను. ఎవరిని అడిగినా చెబుతార’ని అన్నాడు.

👉అహంకార పూరిత మైన ఆ మాటలు విని బాలిక నవ్వి...మీరు అసత్య మాడుతున్నారు. ప్రపంచంలో ఇద్దరే బలవంతులు ఉన్నారు. వారెవరో చెబితే నీళ్లు ఇస్తాను’* అంటుంది.

👉అప్పుడు కాళిదాసు కాసేపు ఆలోచించి...నాకు తెలియదు. గొంతు ఎండి పోతోంది. ముందు నీళ్లు ఇవ్వమ’ని బతిమాలుకుంటాడు. అయినా ఆ బాలిక కనికరించదు.

👉‘ఇద్దరు బలవంతులు ఎవరో కాదు ఆకలి, దాహం.* ఇప్పుడు చెప్పండి *మీరు ఎవరు?’ అని అడుగు తుంది. బాలిక నేను బాటసారి’ని* అన్నాడు కాళిదాసు.

👉మళ్లీ అసత్య మాడుతున్నారు. బాటసారి అంటే ఒకచోటి నుంచి మరోచోటికి బడలిక లేకుండా వెళ్లాలి. మీరేమో అలిసి పోయారు కదా.

👉ఈ లోకం లో అలా అలసి పోకుండా సంచరించే బాటసారులు ఇద్దరే ఉన్నారు. వారే సూర్యచంద్రులు!’ అని చెప్పి గుడిసెలోకి వెళ్లింది బాలిక.

👉దాహానికి తట్టుకోలేక.. ఆ గుడిసె ముందే నిలబడి.. మాతా నీళ్లు ఇవ్వండి. దాహం తో చనిపోయేలా ఉన్నాను..’అని ప్రాధేయపడ్డాడు కాళిదాసు.

👉లోపలి నుంచి ఓ ముసలావిడ బయటకు వచ్చి...మీరెవరో సెలవివ్వండి...

👉నీళ్లిస్తాను’ అంది. కాళిదాసు దీనంగా... నేను అతిథిని..!’ అని బదులిచ్చాడు.మీరు అసత్యం చెబుతున్నారు.

👉ఈ సృష్టిలో ఇద్దరే అతిథులు. ఒకటి ధనం, రెండోది యవ్వనం. ఈ రెండూ ఎప్పుడు వెళ్లిపోతాయో ఎవరికీ తెలియదు అంటుంది.*

👉కాళిదాసు.. ‘నేను సహనశీలిని నీళ్లు ఇవ్వండ’ని  వేడుకుంటాడు. కానీ ఆమె ‘మీరు మళ్లీ అసత్యమే చెబుతున్నారు. ఈ ప్రపంచంలో ఇద్దరే సహన శీలురు ఉన్నారు.

👉ఒకటి భూమి, రెండోది వృక్షం. ఇప్పుడు నిజం చెప్పు నీవెవరు?  అని అడిగింది ఓపిక నశించిన కాళిదాసు..

👉నేను మూర్ఖుడను. ఇప్పుడైనా నీళ్లివ్వండ’ని అడిగాడు ఆ అవ్వ నవ్వుతూ...ఇదీ అసత్యమే.

👉ఈ రాజ్యంలో ఇద్దరే మూర్ఖులున్నారు. ఒకరు ఈ రాజ్యాన్ని పాలించే _రాజు_. అర్హత లేకున్నా ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నాడు. రెండోవాడు. ఆ రాజు మెప్పు కోసం అసత్య వాక్యాలు చెప్పే పండితుడు’_ అని అంటుంది.

👉ఆ జవాబుతో కాళిదాసుకు కనువిప్పు కలుగుతుంది ఆ అవ్వ కాళ్ల మీద పడి క్షమాపణలు కోరుతాడు

👉ఆ అవ్వ సరస్వతీదేవిగా సాక్షాత్కరించింది.

👉‘కాళిదాసా..! విద్యతో వినయం వృద్ధి చెందాలి కానీ, అహంకారం కాదు నాయనా!

💧కీర్తిప్రతిష్ఠల మాయలో పడిపోయిన నీ బుద్ధిని మరల్చడానికే ఈ పరీక్ష’ అని జలమును అనుగ్రహిస్తుంది

Show ad in Posts/Pages