Type Here to Get Search Results !

నమ్మకం - విశ్వాసం

0


ఎత్తయిన రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది.
దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు.

వంద అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవ సాగాడు.

చేతిలో పొడవయిన కర్ర ఉంది...
బుజాన అతని కొడుకు ఉన్నాడు,

అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు....

అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు,

అందరూ చప్పట్లు కొట్టారు.
కేరింతలలో ఆహ్వానం పలికారు...
చేతులు కలిపారు ఫోటో లు తీసుకున్నారు.

నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలను కుంటున్నాను వెళ్లగలనా? అని అతను ప్రశ్నించాడు...

వెళ్లగలవు, వెళ్లగలవు జనం సమాదానం.

నా మీద నమ్మకం ఉందా?..

ఉంది,ఉంది. మేం పందానికి అయినా సిద్దం!

అయితే మీలొ ఎవరయినా నా భుజం మీద ఎక్కండి, అవతలకి తీసుకు పోతాను! అన్నాడు.

అంతే అక్కడంతా నిశబ్దం..
జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు,
ఉలుకు లేదు, పలుకు లేదు,

విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి.

ఈరోజుల్లో  మనం
కోల్పోతున్నది ఇదే!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages