Type Here to Get Search Results !

1960 - 1990 మధ్యలో మీరు పుట్టినవారే అయితే...ఇది మనకోసం..



  వీధుల్లో ఆటలాడి, అరుగులపై నేర్చుకున్నది  మనదే చివరి తరం........

  పోలీస్ వాళ్ళని  నిక్కర్లలో చూసిన తరమూ మనదే.......

  స్కూల్ కి నడుచుకుంటూ, మధ్యలో స్నేహితులని కలుపుకొని వారితో నడుస్తూ వెళ్ళిన వాళ్ళం కూడా మనమే..... దూరం అయితే సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు......

  స్కూళ్ళలో టీకాలు ఇప్పించుకున్న తరమూ మనదే.......

  రేడియోలలో వచ్చే పాటలని టేప్ రికార్డర్ క్యాసెట్లలో  రికార్డింగ్ చేసినవాళ్ళం......

  అలాగే వాక్ మ్యాన్ తగిలించుకొని పాటలు వినేవాళ్ళం......

  VCR ని ఎలా వాడాలో తెలుసుకొని, క్యేసెట్లు అద్దెకు తెచ్చి సినిమాలు చూసిన తరం మనదే.......

  స్కూల్ కి కాళ్ళకి చెప్పులు లేకుండా, స్కూల్ బ్యాగ్ లేకుండా, జుట్టు కూడా దువ్వుకోకుండా మామూలు బట్టలతో వెళ్ళాం.........

  స్కూల్ లో బెత్తంతో దెబ్బలు తినేవాళ్ళం. స్నేహితుల మధ్య " కాకి ఎంగిలి " చేసుకొని ఎన్నో తినుబండారాలు పంచుకోనేవాళ్ళం........

ఆస్తులు, అంతస్థులు చూడకుండా స్కూల్ పై వెళ్ళేవాళ్ళం. చెరువు గట్ల వెంట తిరిగేవాళ్ళం, కాలవల్లో స్నానాలు చేసేవాళ్ళం........

  జాతరలలో దుమ్ము దూళితో ఉన్నా జీళ్లు, ఖర్జూరం తినేవాళ్ళం మనమే.......

  సాయంత్రం వేళ దాగుడు మూతలు, ఉప్పుఆటలు, అష్ట చెమ్మ,  వెన్నెల కుప్పలు ఆడిన తరము మనదే.......

  శుక్రవారం సాయంత్రం "చిత్ర లహరి" కోసం ముందు గానే స్నానం చేసి వచ్చి కూర్చున్న తరమూ మనదే......

  ఆదివారం ఉదయం 9కి పనులు తప్పించుకుని "మహాభారతము" "రామాయణం"  " శ్రీకృష్ణ" చూసిన తరమూ మనదే.....

  ఉషశ్రీ గారి భారత, రామాయణ ఇతిహాసాలు రేడియోలో విన్నది మనమే.....

  అమ్మ ఇచ్చిన పదిపపైసల్ని అపురూపంగా చూసుకున్న ఘనతా మనదే .......

  ఆదివారం ఒక గంట అద్దె సైకిల్ కోసం రెండు గంటలు వేచి ఉన్నది మనమే.....

  మట్టి పలకలని వాడిన ఆఖరు తరం కూడా మనదే......

  రూపాయికే థియేటర్ లో సినిమా చూడడానికి రెండు కిలోమీటర్ లు నడిచిన కాలం  మనదే....

  గొడుగులు లేక సంచులని కప్పుకుని బడికి పోయిన కాలం.. మనమే.. మనమే, అమ్మ 5 పైసలు ఇస్తే బఠానీలు తిన్నదీ మనమే......

  గోర్లపైన కొంగ గోరు గుర్తులు చువ్వాట..సిర్రగోనే ఆట.. కోతి కొమ్మ... అష్ట చెమ్మ... ఆడిన తరము మనదే....

  క్యాలిక్యులెటర్స్ వాడకుండా లెక్కలనీ చేసిన తరమూ, కనీసం 20 ఫోన్ నంబర్స్ ని గుర్తుంచుకొన్న తరమూ మనదే......

  ఉత్తరాలని వ్రాసుకొని, అందుకున్న తరమూ మనదే.....

  మన పిల్లలకు అవి తెలియదు, మన పెద్దలకు ఇవి తెలియదు......కానీ మనం అవి, ఇవి అన్ని చూశాం......

*ఆ ఆనందం మరెన్నడూ తిరిగిరాదు. మీ స్నేహితులందరికి పంపండి.......అచ్యుత మణి🙏🙏🙏

Tags

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages