✍....
రామచంద్రపురం ని రఘువర్మ అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు.
ఆయన ఒకసారి తన పరిపాలనలోని కృష్ణాపురం మరియు రామాపురం అనే గ్రామాలను పరిశీలించి అక్కడి ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవాలని అనుకున్నాడు ...
.కానీ తీరా విచారిస్తే ఆ గ్రామాలకు అసలు రధం వెళ్లే సౌకర్యం కూడా లేదని సుకున్నాడు తెలుసుకున్నాడు .
సంబంధిత అధికారులు అయిన కొండయ్య ను పిలిచి కృష్ణాపురం లోని రహదారులను చేయమని మరియు ధర్మయ్యను పిలిచి రామాపురం గ్రామంలోని రహదారులను బాగు చేయమని ఆదేశించాడు.
ఒక పదిరోజుల తర్వాత కృష్ణాపురం వెళ్లారు వెళ్లిన మహారాజు ఆశ్చర్యపోయాడు ...
అక్కడ కనీసం రధం వెళ్లే అవకాశం కూడా లేదు ఇక ముందుకు సాగడమే కష్టం
ఇదే విషయాన్ని కొండయ్య ను పిలిచి అడిగాడు.. అప్పుడు అతను' మహారాజా నేను రహదారి నిర్మాణం ప్రజలందరిని అర్థించాను కానీ ఏ ఒక్కరూ సహాయానికి ముందుకు రాలేదు ముందుకు రాలేదు అందువల్ల నేనేమీ చేయలేకపోయాను క్షమించండి 'అన్నాడు ..
సరే అని మహారాజు రామాపురం వెళ్లారు .
రామాపురం రహదారులన్నీ చదును చేయబడి ఎంతో అందంగా ఉన్నాయి . మహారాజు ఆశ్చర్యపోయాడు ధర్మయ్యను పిలిచి అదే విషయం అడిగాడు..
'నాదేముంది మహారాజా అంతా ప్రజల కృషి.'. అన్నాడు అన్నాడు ధర్మయ్య.
మహారాజు మరింత ఆశ్చర్యపడి ప్రజలని అడిగాడు ఎలా సాధ్యమైంది అని.
.'నిజమే మహారాజా ..ధర్మయ్య రహదారి నిర్మాణానికి మమ్ములను సహాయం అడిగాడు కానీ మేము వెళ్ళలేదు ..అప్పుడు ఆయన ఒక్కడే రహదారి నిర్మాణానికి పూనుకొన్నాడు.. మేమందరం చూస్తూ ఉండలేకపోయాం .. అందరం కలిసి రహదారి నిర్మాణానికి కృషి చేశాం ..మా గ్రామానికి ఇప్పుడు మంచి రహదారి ఉంది .ఇది అంతా ధర్మయ్య చలవే'అన్నారు ప్రజలు.
మహారాజుగారు ధర్మయ్య యొక్క నాయకత్వ లక్షణాలను గుర్తించి ఆ గ్రామానికి పెద్దగా నియమించాడు....
*****************************************
పని చేయమని ఎదుటి వారిని ఆదేశించడం కాదు...మనం కూడా మార్గదర్శకం గా నిలవాలి.
*****************************************
*ఉద్యమేనైవ సిద్ధ్యంతి కార్యాణి* *న* *మనోరథైః* ।
*న* *హి* *సుప్తస్య* *సింహస్య* *ప్రవిశంతి* *ముఖే* *మృగాః* ॥
ఉద్యమం అనగా కృషి లేక పరిశ్రమ. ఏదైనా మంచి కార్యాన్ని సంకల్పించినప్పుడు లేదా తలపెట్టినప్పుడు, ఆ సత్కార్యాన్ని ప్రారంభించడానికి ముందస్తుగా ధృఢ సంకల్పం ఉండాలి. కొనసాగించడానికి కృషి ఉండాలి. కార్య సాఫల్యతకి కృషి లేదా పరిశ్రమ అత్యంత ఆవశ్యకమే కాక, కీలకము కూడా. ఆ కార్య సాధనని ఒక ఉద్యమ స్ఫూర్తితో తీసుకోవాలి. తలపెట్టిన కార్యాన్ని పూర్తి చేయడానికి పట్టుదల మరియు ధైర్యం ఉండాలి. కార్య సాఫల్యతకై చేసే ప్రయత్నం లో ఎదురయ్యే అపజయాలను ఎదుర్కోవడానికి గుండె దిటవు కావాలి. అట్టి కార్య సాధనకై, కృషీ పట్టుదలతో పాటు స్థిరచిత్తము, ధృఢసంకల్పమూ, ఏకాగ్రతా, గమ్యాన్ని చేరడానికి తగినంత ఓర్పు అత్యంత ఆవశ్యకం. అప్పుడే లక్ష్య సాధన దిశగా పయనించ గలుగుతాం.
ఆ విధమైన ఉద్యమముతోనే కార్యములు సిధ్ధించును. అంతే కానీ, కేవలం మనోరథములచే కార్యములు సిధ్ధించవు. మనోభీష్టము చేత కోరికలు ఈడేరవు.
అరణ్యమంతటికీ రాజైన సింహం కూడా తన ఆకలిని తీర్చుకొనుటకై వేటాడావలసిందే. వేటాడి ఆహారం తినవలసినదే! అంతేకాని, అడవికి రాజైనంత మాత్రాన తన ఆకలిని తీర్చుకొనుటకై నోరు తెరచుకుని కూర్చంటే, “ఓ సింహమా నీ ఆకలిని తీర్చుకొనుము” అని వన్య మృగాలు వచ్చి దాని నోటిలో ప్రవేశించవు.
🌸🌸🌸🌸🌸🌸🌸