🌾🌾🌾🍂🍂🍂🌾🌾🌾
🍂 మాటల్లో మెత్త దనం ఉండాలని నాలుక, ప్రవర్తనలో సున్నితత్వం ఉండాలని హృదయం ఎముకలు లేకుండా సృష్టించ బడ్డాయి..!!
🍂 కావున నాలుకతో కఠిన మైన మాటలు మాట్లాడి సున్నితమైన హృదయాన్ని బాధ పెట్టరాదు..!!
🍂 నమ్మకం నీ మీద ఉంచుకుంటే అది నీ బలం అవుతుంది... వేరొకరిపై ఉంచితే అది నీ బలహీనత అవుతుంది..!!
🍂 మంచితనం అనేది మహా వృక్షం లాంటిది... ఎవరెంత నరికినా మళ్లీ మళ్లీ చిగురిస్తూనే ఉంటుంది.... గుండె లోతుల్లోంచి జీవం పోసుకుంటూనే ఉంటుంది..!!
🍂 జీవితం లో నియమాలు ఎక్కువైతే మీ ముఖం లో నవ్వు తగ్గిపోతుంది.. ఎక్కువ కావలసింది జ్ఞానం కానీ నియమాలు కాదు... అర్థంచేసుకోండి..!!
🍂 మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది..!!
🍂 ఎంత ఎత్తు లో ఉన్నప్పటికీ దాన్ని చేరుకునే మార్గం మాత్రం నీకాళ్ళ క్రింది నుండే మొదలవుతుంది..!!
🍂 కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి. మనసుకి తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి..!!
🌾🌾🌾🍂🍂🍂🌾🌾🌾