🌹🏑ఆగస్టు 29, జాతీయ క్రీడా దినోత్సవం.. భారతదేశంలో క్రీడా దినోత్సవ సృష్టికర్త హాకీ మాంత్రికుడు "ధ్యాన్‌చంద్" గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు..🏑🌹
👉భారతదేశమునకు ఒలింపిక్స్ నందు హాకీ క్రీడలో బంగారు పతకాలను గెలుచుకొనివచ్చి, హాకీని జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన వారిలో ముఖ్యలు మేజర్ ధ్యాన్‌చంద్. చందమామ (చాంద్) పండు వెన్నెల్లో హాకీని అమితమైన ఆసక్తితో, ప్రేమతో అడేవారు కావడంతో అతనిని ముద్దుగా మనం 'ధ్యాన్‌చంద్' అని పిలుస్తే ఆటలో హాకీస్టిక్‌తో ఆడే తీరుకు మంత్రముగ్ధులైన ప్రేక్షకులు 'హకీ క్రీడా మాంత్రికుడి'గా అభివర్ణించడం వెనుక ధ్యాన్‌చంద్‌కు హాకి క్రీడపై గల విశేష ప్రతిభను తెలుపుతాయి. "మీ హాకీస్టిక్ దగ్గరే బాల్ వుంటుంది, మీరు క్రికెట్లో రన్స్ చేసినట్లుగా హాకీలో గోల్స్ వేస్తున్నారు". అని ఇంకొదరు, "మీరు మా దేశానికి వస్తే మంచి ఉద్యోగం హోదా కల్పిస్తాం, మా దేశం తరుపున ఆడండి" అని అడాల్ఫ్ హిట్లర్ సైతం పిలిచినప్పటికి "లేదు, నేను భారతీయున్ని, నేను నా దేశం తరుపున మాత్రమే ఆడుతానని" చెప్పి దేశభక్తిని చాటుకొన్న మహోన్నత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్.
👉ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) ఒక సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు. హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుల్లో ఒకడు.గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచేవాడు. భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడు..ఒకసారి తను గోల్ వేసిన తరువాత అది పడకపోతే తను గోల్ వేసిన విధానం విధంగా ఉన్నదని ఒకసారి గోల్పోస్ట్ కొలతలు సరిచూడవలసిందిగా అంపైర్ ను కోరగా అది సరియైన గుర్తింపుగా అందరి మన్ననలు పొందారు తద్వారా ఆయనకి ఆటమీద గల అభిమానం తెలియజేస్తుంది.
🍁వ్యక్తిగత వివరాలు🍁
👉జననం : 1905 ఆగస్టు 29
అలహాబాద్, ఉత్తర ప్రదేశ్
👉మరణం : 1979 డిసెంబరు 3 (వయసు 74) ఢిల్లీ
👉ఎత్తు : 5 ft 7 in (170 cm)
👉ఆడే స్థానము : ఫార్వార్డ్
🍁క్రీడా జీవితము సంవత్సరాలు🍁
👉1921–1956 భారత సైన్యం
👉1926–1948 భారత హాకీ జట్టు
🍁ఒలంపిక్ క్రీడలు🍁
👉స్వర్ణము 1928 ఆంస్టర్డ్యామ్ బృందం
👉స్వర్ణము 1932 లాస్ ఏంజిలెస్ బృందం
👉స్వర్ణము 1936 బెర్లిన్