Type Here to Get Search Results !

మహిళా దినోత్సవం

మార్చి 8 నే ఉమెన్స్‌ డే ఎందుకు ?

 *కిర్గిస్థాన్‌ నుంచి కాంబోడియా వరకు ప్రపంచ దేశాలు మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.


 ఈ సందర్భంగా రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కతిక రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను దేశ దేశాలు స్మరించుకుంటున్నాయి.


 ఇంకా ఏయే రంగాల్లో మహిళలు విజయాలను సాధించాలో కార్యచరణకు రూపకల్పన చేసుకుంటున్నాయి. ఇంతటి ప్రాధాన్యత కలిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎలా పుట్టింది? ఎలా ఎదిగింది ? మార్చి 8వ తేదీనే ఎందుకు ఖరారయింది ? అన్న అంశాలను కూడా ఈ రోజు తెలుసుకోవాల్సి ఉంది.


 అమెరికాలోని న్యూయార్క్‌ పట్టణంలో 1908లో, ఫిబ్రవరి నెలలో 15 వేల మంది మహిళా వస్త్ర వ్యాపారులు చేసిన ఆందోళన ప్రపంచ మహిళా శక్తికి స్ఫూర్తినివ్వగా, 1917, ఫిబ్రవరి 23వ తేదీన రష్యాలో జరిగిన మహిళల ఆందోళన అంతర్జాతీయ మహిళా శక్తిగా అది రూపాంతరం చెందేందుకు దోహదపడింది


 మగవారితో సమానంగా వేతనాలు ఇవ్వాలని, పని గంటలను తగ్గించాలని న్యూయార్క్‌లో మహిళా వస్త్ర వ్యాపారులు సమ్మె చేశారు.


 ఆ సమ్మెకు గుర్తుగా 1909, ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా సోషలిస్ట్‌ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి జాతీయ మహిళా దినోత్సవం జరిగింది.


 1910లో ప్రముఖ సోషలిస్ట్‌ క్లారా జెట్‌కిన్స్‌ పిలుపు మేరకు ‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ వర్కింగ్‌ విమెన్‌’ పేరిట సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 17 దేశాల నుంచి దాదాపు 100 మంది మహిళా ప్రతినిధులు హాజరయ్యారు.


 ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ స్ఫూర్తితోనే 1911, మార్చి 19వ తేదీన ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విడ్జర్లాండ్‌లు అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు జరుపుకున్నాయి.


 1913–14లో మొదటి ప్రపంచ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ పలు దేశాలు కూడా మహిళా అంతర్జాతీయ దినోత్సవాలను జరుపుకున్నాయి.


 రష్యాలో గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తొలి ప్రపంచ యుద్ధానికి వ్యతిరేకంగా మహిళల ప్రదర్శన నిర్వహించింది.


 1917లో రష్యాలో అక్టోబర్‌ విప్లవం ప్రారంభానికి అనువైన పరిస్థితులు నెలకొంటున్న రోజుల్లో జూలియన్‌ క్యాలెండర్‌ ప్రకారం ఫిబ్రవరి 23, రష్యా గ్రెగోరియన్‌ క్యాలెండర్‌ ప్రకారం మార్చి 8వ తేదీన ‘ఆహారం–శాంతి’ పేరిట రష్యా మహిళలు భారీ ప్రదర్శన జరిపారు.


  ఈ ప్రదర్శన నుంచే మహిళలకు కూడా ఓటు హక్కు కావాలనే డిమాండ్‌ ముందుకు రావడంతో అప్పటి రష్యా చక్రవర్తులు దాన్ని అమలు చేశారు.


 బ్రిటన్‌ కంటే ఓ ఏడాది ముందు, అమెరికా కంటే మూడేళ్ల ముందు రష్యా మహిళలు ఓటు హక్కును సాధించడంతో అక్కడి మహిళా ఉద్యమాన్ని విప్లవాత్మకమైనదిగా చరిత్రకారులు భావించారు. 


 1975లో తొలి అంతర్జాతీయ మహిళా సంవత్సరాన్ని పాటించిన ఐక్యరాజ్య సమితి ఆ సందర్భంగా మార్చి 8వ తేదీని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. అప్పటి నుంచి మెజారిటీ దేశాలు మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవంగా పాటిస్తున్నాయి. 

----------------------------------------------------------

అంతర్జాతీయ మహిళా దినోత్సవం

👉మొదట అంతర్జాతీయ మహిళా "శ్రామిక మహిళా దినోత్సవం" గా పిలవబడిన "అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 8 న ఆచరిస్తారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు మరియు ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ మరియు సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, ఈ ఆచరణ వివిధ దేశాలు ముఖ్యంగా తూర్పు ఐరోపా, రష్యా మరియు పూర్వ సొవియట్ సమూహపు దేశాల సంస్కృతిలో మిళితమైంది.

చరిత్ర

👉ప్రారంభంలో మహిళా దినోత్సవం వేరు వేరు తేదీలలో ఆచరించబడింది. చికాగోలో 1908 మే 3; న్యూయార్క్లోఫిభ్రవరి 28, 1909 మరియు ఫిభ్రవరి 27, 1910 రెండవ అంతర్జాతీయ సామ్యవాద సమావేశానికి ముందుగా ఆగస్టు 1910 లో, అంతర్జాతీయ మహిళా సమావేశం కోపెనహాగెన్ లో జరిగింది. అమెరికాసామ్యవాదులచే ఉత్తేజితులై, జర్మన్ సామ్యవాది లూయీస్ జియట్జ్ వార్షిక అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపాలని ప్రతిపాదించగా సహ జర్మన్ సామ్యవాది క్లారా జెట్కిన్ సమర్ధించారు. 17 దేశాలనుండి వచ్చిన 100 మహిళలు మహిళలకు ఓటుహక్కుతో పాటు సమానహక్కులు సాధించడానికి సరియైన వ్యూహమని అంగీకరించారు. తదుపరి సంవత్సరం 1911 మార్చి 19న పదిలక్షలమందిపైగా ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ దేశాలలో 1911 మార్చి 19 న మహిళా దినోత్సవం ఆచరించారు. ఆస్ట్రో-హంగేరియన్ రాజ్యంలో300 పైగా ప్రదర్శనలు జరిగినవి. వియన్నాలో రింగ్ స్ట్రాసెలో ప్రదర్శన చేశారు. మహిళలు ఓటుహక్కు మరియు ప్రభుత్వ పదవుల హక్కు అడిగారు. ఉపాధిలో లింగ విచక్షణ పద్ధతులను ప్రతిఘటించారు. అమెరికాలో ఫిభ్రవరి చివరి ఆదివారం నాడు మహిళా దినోత్సవం జరుపుకుంటూనే ఉన్నారు.

👉1913 లో రష్యను మహిళలు వారి మొదటి మహిళా దినోత్సవాన్ని ఫిబ్రవరి చివరి ఆదివారం జరుపుకున్నారు. (అప్పటికి రష్యాలో జూలియన్ కాలెండర్ అమలులో ఉంది ).

👉1914 వరకు మహిళా సమస్యల గురించి ఎన్నో ఆందోళనలు జరిగినా అవేవీ మార్చి 8న జరగలేదు. అయితే 1914 నుండి ఆ రోజుని మహిళా దినోత్సవంగా ప్రకటించుకున్నారు. ఆ రోజు ఆదివారం కావడం వలన అలా ప్రకటించివుండవచ్చు కానీ, అప్పటినుండే అన్నీ దేశాల్లోనూ మార్చి 8 నే మహిళా దినోత్సవంగా తీర్మానించారు. 1914 లో జర్మనీ జరుపుకున్న మహిళా దినోత్సవాన్ని మహిళా ఓటు హక్కు కోసం అంకితమిచ్చారు. అయితే,1918 గానీ వారికి ఓటు హక్కు రాలేదు.

👉1917 లో ఫిబ్రవరి విప్లవం ఆ నెల చివరి ఆదివారం సెయుంట్ పీటర్స్ బర్గ్లో మహిళా దినోత్సవం జరుపుకోవడంతో మొదలయ్యింది. ( గ్రెగేరియన్ కాలెండరు ప్రకారం ఆ తారీఖు మార్చి 8). ఆ రోజు సెయింట్ పీటర్ బర్గ్ మహిళలందరూ మొదటి ప్రపంచ యుద్ధం మరియు రష్యాలోని ఆహార కొరత ముగిసిపోవాలని నినదించారు. దీన్నే 'బ్రెడ్డు మరియు శాంతి' డిమాండుగా వ్యవహరించారు. లియోన్ ట్రోస్కీ ప్రకారం, 'ఆ రోజే ఒక విప్లవానికి పునాదులు పడతాయని ఎవరూ ఊహించలేదు. వస్త్ర పరిశ్రమల్లోని మహిళా శ్రామికులందరూ పై అధికారుల హెచ్చరికల్ని ఖాతరు చేయకుండా విధులు బహిష్కరించి వీధుల్లో పడ్డారు. అవే విప్లవానికి తొలి అడుగులు".

👉అక్టోబర్ విప్లవం తరువాత సోవియట్ యూనియన్లో ఆ రోజుని అధికారిక సెలవు దినంలా ప్రకటించడానికి బోల్షెవిక్ అలెగ్జాండర్ కొలెన్టైల్ లు, వ్లాదిమిర్ లెనిన్ని ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. కానీ, 1965 వరకూ అది అమల్లోకి రాలేదు. అదే సంవత్సరం సోవియట్ మహిళలు అప్పటి వరకు చూపిన సాధికారత స్మారకార్థం, మార్చి 8న యుయస్సార్ ప్రభుత్వం ఆ దినాన్ని అధికారక సెలవు దినంగా ప్రకటించింది.1917 సోవియట్ విప్లవం తరువాత రష్యా కూడా దీనిని ప్రకటిచింది. చాలా మటుకు కమ్యూనిస్టు, సోషలిస్టు దేశాల్లో దీన్ని పాటించేవారు. 1922 నుంచి చైనావారు, 1936 నుంచి స్పానిష్ వారు దీనిని అధికారికంగా ప్రకటించుకున్నారు. 1949 అక్టోబర్ 1 లో చైనా పీపుల్స్ రిపబ్లిక్ ఏర్పడినది. వారి రాష్ట్రీయ మండలి డిసెంబరు 23న, మార్చి ఎనిమిదిని అధికారిక దినంగా ఉత్తర్వులిస్తూ, చైనా మహిళలకి ఆ రోజు సగం సెలవు ప్రకటించింది.

👉ఆస్ట్రియా లోని Builders Labourers Federation, మహిళా సభ్యులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 1975 నాడు ర్యాలీ నిర్వహించారు. అప్రాచ్య దేశాల్లో, 1977 తరువాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం బహుళ ప్రాముఖ్యత సంతరించుకుంది. అప్పడు మార్చి 8ని మహిళా హక్కులు మరియు ప్రపంచ శాంతి దినంగా ప్రకటించాలని యునైటైడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ పిలుపునిచ్చింది.

👉1980 దశకంలో రినీ కోట్ అనే చరిత్రకారిణి అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవిర్భావం గురించి పరిశోధించింది.

---------------------------------------------------

మహిళలకు మాత్రమే ప్రత్యేకం*

  1. పురుషులు తో పోల్చిన మహిళా టీచర్లకు 5 CL లు అధికం. (G.O.Ms.No.374, Edn, Dt:16-3-1996)
  2. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటే 14 రోజులు సెలవు ఇస్తారు. (G.O.Ms.No.1415, M&H, Dt:10-06-1968)
  3. మొదటి ఆపరేషన్ ఫెయిల్ అయిన రెండవ ఆపరేషన్ కు కూడా 14 రోజులు సెలవు ఇస్తారు. (G.O.Ms.No.124, F&P, Dt:13-04-1982)
  4. లూప్ వేయించుకొన్న రోజు స్పెషల్ CL ఇస్తారు. (G.O.Ms.No.128, F&P,Dt:13-04-1982)
  5. ఆపరేషన్ తరువాత పిల్లలు చనిపోతే రీకానలైజెషన్ చేయించుకున్న  ఉద్యోగికి 21 రోజులు సెలవు ఇస్తారు. (G.O.Ms.No.102,M&H,Dt:19-02-1981)
  6. గర్భసంచి తొలగింపు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫార్సు మేరకు 45 రోజులు ప్రత్యేక సెలవు ఇస్తారు. (G.O.Ms.No.52, Fin,Dt:1-04-2011)
  7. 180 రోజులు ప్రసూతి సెలవు ఇస్తారు. ఇది ఇద్దరు జీవించి యున్న పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. (G.O.Ms.No.152, Fin,Dt:04-05-2010) & (G.O.Ms.No.38, F&P, Dt:13-08-1992)
  8. సమ్మర్ హాలిడేస్ లో ప్రసవించిన , ఇక్కడి నుండి 180 రోజులు ఇస్తారు. (G.O.Ms.No.463,Edn,Dt:04-05-1979)
  9. అబార్షన్ ఐనచో 6 వారాలు సెలవు ఇస్తారు. (G.O.Ms.No.762,M&H,Dt:11-08-1976)
  10. వివాహం కొరకు 75,000 అప్పుగా ఇస్తారు.దీనిని 70 వాయిదాల లో తిరిగి  5.50% వడ్డీ తో సహా చెల్లించాలి. (G.O.Ms.No.39 F&P,Dt:15-04-2015).
  11. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది (G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)
  12. ఉద్యోగకల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు. (G.O.Ms.No.27 తేది:09-01-2004)
  13. మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు. (G.O.Ms.No.350 తేది:30-07-1999)
  14. అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం. (Memo.No.17897 తేది:20-04-2000)
  15. పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ  ఉత్తర్వులు. (G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)
  16. ఎస్.ఎస్.సి సర్టిఫికేట్లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు.  (మెమో.నం.7679 తేది:14-09-2010)
  17. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు. (G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)
  18. మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు. (G.O.Ms.No.374 తేది:16-03-1996)
  19. జూనియర్  లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు. (G.O.Ms.No.03 తేది:05-01-2011)
  20. వివాహం ఐన మహిళా ఉద్యోగికి క 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి  సెలవు మంజూరు చేయబడుతుంది. (G.O.Ms.No.152 తేది:04-05-2010)
  21. మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు. (G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968) (G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)
  22. మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)
  23. ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)
  24. మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు. (G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)
  25. చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరుచేయబడును. (G.O.Ms.No.762 M&H తేది:11-08-1976) 
  26. మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి మొత్తం సర్వీసులో 60 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు. (G.O.Ms.No.132 తేది:06-07-2016)



Tags

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages