Type Here to Get Search Results !

తెలుగు వర్ణమాలలో కరోనా:



*అ* క్కడెక్కడో పుట్టింది 
*ఆ* పదలో పడేసింది
*ఇ* టలీకి వెళ్ళింది 
*ఈ* జిప్టుకు పాకింది 
*ఉ* ధృతంగా పెరిగింది 
*ఊ* చకోత కోస్తోంది
*ఋ* క్కులకే లొంగనంది 
*ఎ* ప్పుడు వస్తానో చెప్పనంది
*ఏ* డిపించుకుతింటోంది 
*ఐ* శ్వర్యానికి లొంగనంది 
*ఒ* క్కోదేశానికి అంటుతోంది
*ఓ* డలు విమానాలను ఆపేయించింది
*ఔ* షధాలే లేవంది 
*అం* దరికీ వ్యాపిస్తోంది 
*అః* కఃనః అన్నట్లుంది (అర్థం కానట్టు ఉంది)
*క* రోనా తన పేరంది
*ఖ* నిత్రం లా దిగుతోంది (ఖనిత్రం అంటే గునపం' పలుగు)
*గ* రిష్ఠంగా పెరుగుతోంది 
*ఘ* నుడు సామాన్యుడని చూడనంది
*జ్ఞ* వలే తెలియనంది
*చ* టుక్కున అంటుకుంటుంది 
*ఛ* రఖాలా తిరుగుతోంది 
*జ* బ్బుల్లో పెద్దదయింది 
*ఝం* డా ఎగరేస్తోంది 
*ఞ*! ఆ! యా! అని వెక్కిరిస్తోంది
*ట* క్కుడెక్కులు చూపిస్తోంది
*ఠ* క్కున అంటుకుంటుంది 
*డ* బ్బులకు లొంగనంది 
*ఢ* మరుకం మోగిస్తోంది 
*ణ* లా బుద్ది వంకరది
*త* నకు ఎదురు లేదంటోంది 
*ద* య్యంలా పీడిస్తోంది 
*ధ* ర్మం న్యాయం తనకు లేవంది
*న* లుగురు కలిస్తే ఓర్వలేక పోతోంది
*ప* రుగులు పెట్టిస్తోంది
*ఫ* లితం లేదంటోంది
*బ* డులు గుడులు మూయించింది
*భ* యాన్ని ఇంకా పెంచుతోంది 
*మ* రణమృదంగం మోగిస్తోంది 
*య* ముని దగ్గరకు పంపిస్తోంది 
*ర* క్కసి లా తినేస్తోంది 
*ల* క్షలమందిని కబలిస్తోంది 
*వ* రదలా ముంచేస్తోంది 
*శ* నిలా దాపురించింది 
*ష* ట్కాలాల్లో కూడా తానుంటానంది
*స* బ్బునురగంటే భయమంటుంది
*హ* రించుటే తన గుణమంది
*ళ* ఇలా అంటూ అంటుకుంటోంది ('ళ' ను అల అని చదువుతుంటారు)
*క్ష* మించడం తన డిక్షనరీ లో లేదంది 
*ఱ* ౦పము లా కోసేస్తోంది
 
“ఇంట్లో ఉండండి-సురక్షితంగా ఉండండి”

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages