Type Here to Get Search Results !

ఒక స్వరం ఆగింది : చురకశ్రీ

ఒక స్వరం ఆగింది,
ఒక శరీరం నిర్జీవం అయింది.
ఒక వేదన ఎడారి పాలైంది,
ఒక ఆవేదన అరణ్యరోదన అయింది.
అనుకుంటే పొరపాటే

ఆ స్వరం అనేక గళాలకు పల్లవి అయింది

ఆ శరీరం పీడన వర్గాల గుండెచప్పుడైంది

ఆ  వేదనలు జనసమూహల రాచబాట అయింది

ఆ  ఆవేదనలు కోట్ల జనుల కాంతిపుంజాలు రహదారి అయింది

ఇది అక్షర సత్యం

 ఆ గళం దోపిడీ దారుల గుండెల్లో చురకత్తులైయి

ఆ స్వరం బలహీనుల కలయికతో బాహుబలులై,మహాబహులను చేసింది

ఆ కలం విప్లవకారులకు దిక్సూచి అయింది

ఆ నృత్యం పాపాత్ముల పాలిట సింహస్వప్నం అయింది

 ఆ రూపం అరాచక పెట్టుబడిదారీ వ్యవస్థకు శివతాండవం ఆడించింది

ఆ వ్యక్తి సమాజ శక్తి గా మారి సామాజిక సమస్య పరిష్కారానికి కృషి  చేసింది

అందుకే అందుకే అందుకోవయ్యా, ఓ వంగపండు మా అంజలి దండ...

జోహార్.. జోహార్ ఓ ...వంగపండు 
నీకు మరణమా??? లేదు లేదు...
 రాదు రాదు... వంగపండు  ..నీ వెంట

 ఎన్నో ఎన్నెన్నో గళాల గలగలు వరదలు లా ఉంటాయి, నీవు

 నిశ్చింతగా, నిశ్చలంగా  ఆత్మశాంతిగా  ఉండిపో,నీ ఆత్మకాంతి దిశదిశులుగా ప్రకాశించు గాక.....

    *** చురకశ్రీ***

రచయిత, సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ ,కావలి

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages