*"********
నీ కట్టుబొట్టు నచ్చిందే సిగలో మల్లెల సరాలు
నిగనిగలాడే నాజుకైన నారి నీలాక్షీ
తళతళలాడే తళుకుబెళుకుల తరుణి
కళకళలాడే నా కలల కమలాక్షీ
మిలమిలలాడే కనులకాంతులతో మెరిసే మదిరాక్షీ
మిసమిసలాడే గువ్వ మృదువైన మగువ
రుసరుసలాడేరంగురంగుల రంగేళి
గుసగుసలాడే సొగసైన గడసరి భామాశ్రీ
సలసలలాడే సరసాల సుగంధ సుగాత్రి
పకపకలాడే పసందైన పుత్తడి బొమ్మ
చకచకలాడే చలాకీ చల్లని చక్కనమ్మా
నవ్వులు వొలకబోసే నా మనో జవ్వని
వరాలు వెదజల్లే నా కల్ప వరలక్ష్మి
ఆ నిగారింపులో అలసటలేదు, ఆతళకుల్లో తొణికిసలాటలేనేలేదు
ఆ కళలలో నిసత్తువ రానే రాదు,ఆ కనులలో చింతనలు కానరావూ
ఆనవ్వుల కిలకిల ల్లో అనురాగాల సవ్వడల్లు హరివిల్లులై కానవచ్చు.
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.