#######################
పల్లవి -
చెండు చెండు నీవే నా బుజ్జి పండు
నీవు ఎల్లప్పుడూ నా మనసున ఉండు
నేను ఎప్పుడు నీ తోడు ఉండు # చెండు చెండు... #
చరణం--
ఆగు ఆగు బుల్లోడా అంత తొందర ఎందుకు
వెనుక ముందు చూసుకో లేక కుంటే గుండె దడ పుట్టుతుంది కుర్రాడా
# చెండు..#
చరణం....
గుండె దడ పుట్టిన, గుండె పట్టిన
నీ అందమైన వంపు సొంపులు,లేలేత మోము చెక్కిళ్ళు చూసాక
నా వయసు ఉరకలేస్తుందే కుర్రదాన
# చెండు...#
చరణం...
వయసు ఉరకలేసిన, అలకలేసిన అదుపుచేసుకో
నేను ఇప్పుడు పలకరించనులే పనిపాటలేని దానిని కాదులే కుర్రాడో
#చెండు...#
చరణం....
పనిపాటతో ఏముందిలే పిల్లా
ముందు మాట మంతితో పూలబంతి ఆటలాడుకుందాం మనం వచ్చేయి ఓ వయ్యారి పడుచుపిల్లో
# చెండు...#
చరణం....
ఆటలాడే వేళకాదులే సక్కనోడా ముందు ముందు ఉందిలే నా గుండె లో దూరి గూడుకట్టినోడా ...
చెండు....
ఆహా ఆహా ఆహా ..ఓహోఓహో.
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి