పిల్లా! పిల్లా!! ఓ చలాకీ పిల్లో!! ఎందాకా నీ చిందులు;
ఆపరుగులచిందులు నా ఆనందాల సంగమ నృత్యకేళి
ఆగు ఆగు పిల్లా! నీ ఓరాకంటి చూపులతో నన్నే కట్టిపడేసావే;
ఆగి ఆగి కొంటె చూపులతో నా మనసు గుచ్చి గుచ్చి రచ్చచేయక
వచ్చి మచ్చికతో ఉండవే నెచ్చెలి!
నీ వలపుల చూపులతో రెచ్చగొట్టమాకు నే నిలువలేను!వయ్యారి!!
పచ్చపచ్చనితోటలో దాగిదాగి చూసే సన్నజాజి తీగ !
కాస్త ఆగి నన్ను అలుకో ;సువాసన వెదజల్లే మల్లి /మల్లేశ్వరి !!
ఆ చోట ఈచోట ఎగరమాకే నా పరువాల పడుచు చిలుక !
నా చెంత చేరి నచ్చినట్లు అచ్చికబుచ్చికలాడుదాం!అంబుజవదన!!
ఇచ్చుకున్న మాటలు మరచిపోలేదులే; నచ్చిన బాటలు విడువలేదులే ;
మెచ్చిన పంచిన మమతలు పదిలంగా ఉన్నాయిలే;
చేసుకున్న బాసలుమనస్సున దాగిఉన్బాయిలే ;
రాక రాక వచ్చవే! గడసరిదానా! మెచ్చింది మనసారా! పంచుకుందామే;
బిజిలి ఇదే ఈ మజిలీ లో కడదాకా మిగిలేది ఓ నా కోమలి.
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.