Type Here to Get Search Results !

నీ పలకరింపుతో పులకరింపై ఊపు వచ్చే ఓ పోరీ

0

 నే చూసినప్పుడల్లా  తలదించుకునే ఉన్నావ్;


నే వెంటపడినప్పుడల్లా  తలవంచుకునే నడుస్తూన్నే ఉన్నావ్;


నే నవ్విన నవ్వకుండనే రుసరుసలాడుతున్నావ్ !


నే పలకరించిన ఏమి  పట్టిపట్టనట్లు ఉండిపోతున్నావ్;


నే మాట్లాడే సమయానికి సలసల సాగిపోతున్నావ్ ;


అది ఏమిటో  నే ఏమి చేసిన పరుగుపరుగున జారి పోతున్నావ్!!


అంతుచిక్కవోయి ఓ బంగారం నీ వాలకం ఏమిటోయి ;


ఎందుకో ఆ పరుగులు, ఏమిటో నాపై చిటపటలు ;


ఇక ఆపై నే పడే తటపటలు ఇక చాలు  ఈ తిరుగుళ్ళు;


నా  మానాన వాలిపోయిన పొద్దులా మౌనమే మంచిదని  ఉండిపోయా!


పసిడి తీగ నుండి సన్నని మృదువైన నీ స్వరాలపవనాలు తాకే;


నాలో సంబరాలు చిందులేస్తూ అంబరాలకు అంటే నా ఓ ! కొంటెదాన!


నే తలెత్తి చూస్తే నీ మనోహర రూపం! తళతళలాడే  ఓ!  తన్వి!!


నీ నవ్వుల మోము నాలో ఎన్నో కాంతి పుంజాలు వెదజల్లే  ఓ ! నారి !


రుసరుసలాడిన నీ చెక్కిళ్ళు రంగురంగుల హరివిల్లు అయ్యే ఓ! రమణి!!


నీ పలకరింపుతో పులకరింపై ఊపు వచ్చే ఓ!  పోరీ !


నీ ఇంపైన  కేశసంపద నీ  లే లేత పాలబుగ్గలపై పడి   నన్ను మంత్రముగ్ధుని చేసే  ఓ!  కేశిని !!


కలత చెందిన నా మనసు నకు ఊతమించినావే  ఓ ! నా మెలత !


నా ఘోష ఆలకించి నన్ను మైమరింపచేయగా వచ్చిన  ఓ ! నా యోష!!


నీ పకపక కోసమే నే వేచి నీకోసమే కాచినాను  ఓ!  పరువాల ముత్యాల సరాల పకపకనవ్వులరాణి !!


నీతోనే  నాపయనం;  నీతోనే జీవనం ; నీతోనే జీవితం ; ఓ!  జవరాలా !!


రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages