Type Here to Get Search Results !

అందుకే నీవే కావాలి నా ప్రియా.....!!!

0


######################
######################

ఆకుపచ్చని నా తామరతోపులో పాలమీగడ తరగల చెక్కిళ్ళున్న ఓ..నా పడుచుపిల్లా !

నీ ముఖారవిందం వసంతంలా కాంతులీనుతుంటే ఆ నీ నవ్వులు చూపులు పైపైనవి కావే అమ్ముడు!!

నీ హృదయ అంతరంగ ఆనందాల హరివిల్లులు,ఏ తామరలో దాగిఉన్నాని వెతికి వెతికి వడిసి పట్టి!

మత్తుగా గమ్మత్తుగా గంతులతో నాపై  చిందులు వేసే ఓ నా మహీ!!

ఎర్ర ఎర్రని తామరలను నీ ముచ్చటైన పెదాలతో ముద్దాడుతూ,మురిపంగా  ఆడుతూ!
నన్ను వొక్కిరిబుక్కిరి చేసే నా హృదయ మనో రంజని!!

నీ చేతిలోని ఆ పుష్ప కాడల వీణ  చేతికొనలతో మీటి గుండెల సప్తస్వరాల పలికిస్తూ ఉంటే!!

శృతిలయలనై
నే మై మరచి పోనా నీ వెంటే నడిచి ఉండిపోనా ఓ మనసా!

నా శరీరపు తోపున తేలియాడుతూ పుష్ప గుత్తులను నేనే అని పైయదను హత్తుకుంటూ!!

సిగ్గు వొగ్గులతో ఓర చూపులు ఒలకబోసే పకపకనవ్వులరాణి!

నన్ను నీ వడిలో మనసారా లాలనగా పాలన చేసే సుందరీ!!

నీ కిలకిల నవ్వుల సవ్వడులల్లో నా హృదయ స్పందన/(లవ్వు,నవ్వు) లబ్ డబ్ ఉందే వనజాక్షీ!

నీ హృదయ మందిరం నిజమైన నా జీవ ఆలయప్రాంగణం స్వర్ణ మంజరీ!!

ఇలాంటి ప్రేమే  ఖచ్ఛితమైన విశ్వప్రేమ జగతిన నన్ను వదలి పోకే ప్రేమమయీ!

పొద్దున జలకొలను న పుష్పించే సూర్య తారక!!

నీ అడుగుల చప్పుడు తో నాలో దాగిన ప్రేమ తట్టితట్టి ఏడు అడుగుల బంధానికి ఇంధనమైయే!

 అందుకే నీవే కావాలి నాప్రియా !

నీవు నాపై నడియాడి జతచేరకపోతే నాలో జవసత్త్వాలుండవే అందాల జవ్వని!!

రచన- సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages