నీలి ఆకాశ నల్లని మబ్బుల మాటున దాగి నేలవాలిన;
పసందైన చక్కదనాల "చుక్క" నీవు నా పక్కన చేరితే ;
నీ బిగి కౌగలిలో వెచ్చగా ఉండిపోనా?;
నా హృదయ స్పందనలతో
నిన్ను నే ఉక్కిరిబిక్కిరి చేయనా ?
ఓ! నా ప్రేయసి చిలిపి నవ్వుల పుష్ప సుగంధి!
నా చెక్కిలిగింతలతో నీ మోము చిరుమందహాసపు అయ్యే చిరుమందహాసిని!!
ఆహ్లాదకరమైన నీ చూపుల ఊపులతో నే నిన్నే అల్లుకుంటి నీ ప్రేమ చంటిలా;
ఆ గలగల నవ్వుల జలపాతంతో నీ బుగ్గలు ఎరుపు ఎక్కే మొహంతో!
పాలపుంత లాంటి నీ పళ్ళు ప్రకాషితమై ముత్యాలసరాలు అయ్యే!!
నా చేతులు నీ ఉదరంపై "సరిగమలు" ఆడే నీలో ధ్వనించే గిలిగింతలు!
నా వలపు బాణాల దాటికి
నీ మోము సప్త వర్ణాల సంద్రం అవ్వగా;
నా మది పులకరించే నా ఎద తరంగాలు నిన్ను వీడిరాక!!
నిన్నే తాకి హత్తుకుంటూన్నాయే సునామీ లా అవి!
నిన్ను నా అనంత అంతరంగ మందిరంలో బంధి చేసి లీలం చేయాలని ఉందే!!
నన్నే కోరి వచ్చిన ముసి ముసి నవ్వుల రాగిణి!!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.