సన్నా సన్నని సన్నజాజి విరిసిన నవ్వుల పువ్వా,
నా ఎద మాటున మాటువేసిన మువ్వల గువ్వ
నేనంటే పడి చచ్చే చంపకమాల!
నా వెంట నడిచి వచ్చే ఉత్పలమాల!!
నా శ్వాస,ఆశల్లో నిలిచే శార్దులమా!
నా అస్తిక మస్తికల్లో తిరిగే మత్తేభమా!!
నా హృదయ "కందకం" లో దాగిన ఆటవెలది నీవే !
నా మనంబులో పులకరించే తేటగీతివై!!
నా శరీరంబున కరిగి ఆనందంతో పలకరించే సీసమై !!!
నా, నీ శతవత్సర సాంగత్యంలో నిండుకొలువై
మా ఇంట సిరిసంపదలతో నర్తించే నా భాగ్యలక్ష్మీ వై వర్షించు!
నే పరిపూర్ణమై నీ అందచందాలతో హర్షించదన్ !!
నీ నోముపండగా నామోము ఆనందాలు నిండగా;
ఇంతకన్నా నాకు, నీకు ఇంకేం కావాలి! చెప్పవా? ఓ! నా మనసా!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి.