ఆడ శిశువు అంటే అంత కసరు ఎందుకయ్యా!
నీ కంటి నలుసు కాదు ఆ శిశువు పాశావిక పైశాచికత్వాలతో పసిగుడ్డును చిదిమి మసిచేస్తావు!!
నిన్ను కన్నది ఓ తల్లే,నీవు కట్టుకున్న ఆలి, నీ తోబుట్టువు చెల్లి అంతా వారే ఓ! ప.వా,!మరి నేనంటే ఎందుకు? అంత చికాకు,అంత చిరాకు నీ ఎకరాలు ఇవ్వడం లేదు,నేనేమి నఖ్ఖరాలు చేయడం లేదే !!
నేను ఇంట కలియ తిరిగితే నీ తలరాత గిర్రున తిరుగు పుట్టిన ఇంట మేలుకోరే నీ ఇంటి ఆడబిడ్డ !
నీకు కొరగాని కొయ్య కాదు నీ ఇంట అష్ట ఐశ్వరాలు కలిగించే కామధేనువు ను,అష్టకష్టాలు, నష్టాలు తీర్చే కల్పతరువు ను !!
అది మరచి నా రాకను ఆపిన, ఆపై కలిగే ప్రళయాన్ని ఆపే శక్తి నీకు లేదు గాక లేదు!
నా అందచందాలతో నీ ఇంట రోజు సందడే సందడి,నా పలకరింపే నీకు సంతోష సరిగమపద,స ల స రాగాలు!!
నేనే కడకు ఆసరా అని మరువకు
నన్ను భూమి పై వేధించే వెధవలు వరదలా ఉన్నారు కాదన లేను అంత మాత్రాన నా రాక ఆపితే ఎలా?!
ఇది ఈ నాటిది కాదు యుగయుగాల తంతే సరిదిద్దే మార్గాలు ఎన్నో ఉన్నాయి, కట్నకానుకల బంధాల అనుబంధాల సంగమం!!అయిపోయింది ఇవాళ
అయితే ఎందుకు ఇవ్వాలి, ఎందుకు తీసుకోవాలి తప్పు ఎవరిది,ఎక్కడుంది లోపం,నాది కాదే! పాపం!! నేను పాప ను మీ కంటి పాపను ,మీ అందరికీ తెలుసు కంటే పాపనే కనాలని!! నేను నేనే, నేనే జాతి సృష్టి కి మూలం నన్ను మరిచితే మూల్యం చెల్లించాలి! తప్పదు విధిరాత!! జాగ్రత్త జాగ్రత్త!!! సుమా!
మీ కంటికి అపురూపమై,మీ ఇంటికి దీపాన్ని అయి,మమతలు పంచే అనురాగదేవతనై,మీ నిండుగుండెల మణి తారపు దివ్వెనై ఆడపిల్లనై మీ అందరిలో ఒకటై ఉండాలని నా ముచ్చటైన కోరిక!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.