( 24-1-2021 జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా)
ఆడ బిడ్డ అంటేనే ఎందుకమ్మా గుండెల నిండా దడదడ!
కూత రాక మునుపే నీ కడుపున కోతలు ఏలానమ్మా !!
నే లేకపోతే, రాకపోతే నీవు,మీ ఆయన ఎక్కడమ్మా!
సృష్టి లో మీరు ఒకటే అని మరిచి పొతే ఎలనామ్మా !!
ఏదోఒక వంకతో మీలో చేరిక ఆపితే మీరు మరకలు చెందేనమ్మా/ చెందేరయ్యా !
అచ్చుకు హల్లు చేరి తేనే పదాల జల్లు కురిసేవి!!
నే రాకముందు తడబడిన నే వచ్చాక,మీ వడిలో చేరాకా నా నవ్వుల పలుకల తోటి!
నా కాళ్ళ గజ్జెలు సవ్వడులతో మీ మోము హరివిల్లు చెందేనులే!!
అమ్మా అమ్మా,నాన్నా నాన్నా, మామ,అత్త ,తాతా,అవ్వావ్వా వరసల నా పిలుపులతో మీ మీ మనస్సుల్లో కలుగు ధిల్లు!
గతంలో నా పై ఉన్న చిల్లు వైదొలుగు నాపై కలుగు తరుగులేని ప్రేమ జిగురు!!
నే నట్టింట కాటుక కళ్ళతో తిరుగుతుంటే బాధలు మాయం! పట్టుపావడతో పట్టపు యువరాణి లా నడియాడుతుంటే శ్రీ లక్ష్మీ గలగలలాడు!!
నా మాటలే సరస్వతి పలుకులై అష్ష ధరిద్రాలు సడలి కడలి చేరి ఇంట అష్టలక్ష్మీల కొలువై నర్తించు!
మీ ఇంట నా వల్ల ఆనందాల నిలయాల విలాసపు వికాసం!!
ఆపదలో ఆ బిడ్డే ఆడబిడ్డ అల్లాడి పోయి అక్కున చేరి ఓదార్చే తల్లి ఈ నీ ఆడబిడ్డ !
మీ నెత్తిన పెరిగే గడ్డ కాదురా! ఈ బిడ్డ! కుదుపు లోన,పొదుపు లోన నాకు నేనే సాటి నాకు రాలేరు పోటీ!!
అవున్నామ్మా!! అవును!
ఏనాటికైనా అన్ని విద్యలు ఆరితేరిన పాలక ఏలికవు నీవే నీవే తల్లీ నిన్ను మించిన శక్తి లేదమ్మా!! కడకు నీదే జయం! మన్నించు!!
జయం జయం బాలిక!! ఓ బాలికా మమ్మల్ని ఎల్లవేళలా వెన్నంటి కటాక్షించే కల్పవల్లీ!!
రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి.