నీవు ఎక్కుపెట్టే తుపాకీ లో లేదురా!
శత్రువు నిన్ను కాల్చినప్పుడు నీవు చేసే వందేమాతరం సింహానాదంలో ఉందిరా నీ దేశభక్తి!!
నీవు పడకగదిలో పూలపాన్పు పై సరదాసరదాగా ఉన్నప్పుడు ఉండదురా! దేశభక్తి!
గడ్డ కట్టే మంచులో వణుకుతున్న తొణకకుండా దేశరక్షణ చేస్తునప్పుడు అదేరా దేశభక్తి!!
నీ శరీరాన్ని చీల్చి చీల్చి చెండాడాడు తున్న నీ చివరి రక్తం బిందువు!
మరెందరో మదిలో జైహింద్ అని పలికిచి ఉత్తేజాన్ని, ఉద్రేకాన్ని రేకెక్కిస్తే అప్పుడు ఉంటుంది రా !!దేశభక్తి
(2)
కారుతున్న రక్తాన్ని లేకచేయక కాగుతున్న శరీరం ఉన్నా!
తూట్లు అయి శరీరం వాలిపోతున్న తలెత్తిన తల జాతీయ పతాకాన్ని కి సెల్యూట్ చేస్తే అప్పుడు ఉంటుందిరా నీ నిజ దేశభక్తి!
గీతాలు, గేయాలు పాడిన నాటికలు నాటకాలు(వేసినా) ప్రదర్శించినా నీలో తొంగిచూసేది ఎవరు రా!!
దేశం అంటే మట్టే అది వజ్రపు దేహంతో కూడిన వజ్రపు మట్టి, దానిని కలిగిన జనసమూహపు శక్తిని ఎదిరించే దమ్ము ఎవరికి రా,దేశభక్తి!
ముందు కులాల కుమ్ములాట,మతాల మారణహోమాలు చెల్లవు రా!
అందుకే దేశం అంటే ఐక్యత బలం, బలాలు అలుపు సొలుపు లేకుండా వరదలై పోరాటాలు చేస్తాయి!!
గళాలు గర్జన చేస్తాయి,కలాలు మెరుపులై కదులుతాయి, పొలాల లోని హలాలు జలాలతో పాటు లేస్తాయి!
ఊపే ఖాళీ చేతులు పిడిబాకులైతాయి ఓ సోదరా!!
(3)
అరె అరే ఉచితాల పేరున దేశాన్ని వెనుకకు నెట్టమాకు!
సోమరితనం వరదై ముంచుకు వస్తుంది!!
కాయ కష్టం లేకుంటే కాయం గాయాలకు లోను అవూ! పిరికితనంతో సమరానికి పోలేడు! పోయినా, పోయి రాలేడు!!
దానికిన్ తాయిలాలు ఇస్తేనే పోతాను అంటాడు రా;
పోతుగడ్డ,పోరుగడ్డ! పరాయి పాలాగు ఈ గడ్డ!!
(4)
దేశనాయకుల విగ్రహాలు పెట్టి
పాతిక రూకల
పూలదండతో ఫోటోకు ఫోజుపెట్టి చప్పట్లు కొడితే రాదురా! దేశభక్తి యా!
భుక్తాయసంతో ఉన్నవాడికి పది రూకలతో ఆకలి తీర్చు !!
చలితో గజగజ వణికే వాడికి చలిని దూరం నెట్టు!!
గూడు లేనివాడికి గూడు కట్టు అది రా దేహం ఉన్న వాడి దేశభక్తి చిన్నోడా!!
( 5)
గణగణగణ గంటలు మ్రోగితే రణఘణ ధ్వనులు వింటే రోమాలు సహితం నిటారై నిక్కపొడవాలా!
ఏమిటో తెలుసా? నీకు అవే అవే రణరంగ పదదళాలు,యుద్ధ భేరిలు!!
ఒళ్ళు జలధరించేలా,మనసు పులకరించేలా !
ఎద స్పందనలు ప్రతిస్పందనలతో పూనకం పట్టాలి!!
అదే! రా!! దేశభక్తి !
( 6)
రాజులు,మహారాజులు ,సామ్రాట్లు ఏళ్ల తరబడి అఖండ భరతఖండాన్ని ఏలినారయ్యా;
పరాయి పాలనలో, వలసపాలకుల చేతిలో చితికి నలిగి బలి యైనారయ్యా!
భరించలేని, అవమానాల బానిసలై పోరుచేయలేక; బతుకు అతుకుల బొంత అయి నిరాశ,నిస్పృహ లతో కలత ,నలత చెంది ఊడిగం చేస్తూ;
మాన ప్రాణాలు కృంగి కృశించి నశించరయ్యా!
ఎదురొడ్డిన ఉరి కొయ్యలు స్వాగతాలు పలికాయయ్యా!!
బెంగాల్ లో తొలిపోరు,సిపాయిల తిరుగుబాటు హోరు అనైక్యత ఈర్ష్యాద్వేషాల మధ్య ఓటమిపాలైరయ్యా!
అయినా సడలని దీక్షతో హింసా,అహింసాలతో సాగే ఏళ్ల తరబడి, రవి అస్తమించని తెల్లదొరల పరాయి పాలన విముక్తి కోసం పోరాడి ముక్తిపొందిన వీరులు ఎందరో!!
తమ ధన,మాన,ప్రాణాలను అర్పించిన త్యాగధనులెందరో!జలయిన్ వాల్ బాగ్ ,దండి,క్విట్ ఇండియా ఉద్యమబాటలో నడిచి రక్తపు మడుగులో విడిచిన ప్రాణ నాధులెందరో!!
ఝాన్సీ, తాంతీయోతోపె, గోపాల్ కృష్ణగోఖలే,గాంధీజీ, నేతాజీ, నెహ్రూ,జిన్నా, బాబాసాహెబ్, భగత్ సింగ్,మన్యంవీరుడు అల్లూరి, అమరజీవి కొమరం భీముడు,ముర్సాముండా ఎదురు తిరిగి సర్వస్వం దేశం కోసమే దేహాలు సమర్పించిన ఘనతే వీరిదే!
రక్తసిక్తమైన మరకలతో తడిసిన వీర రక్త భూమి మనదే
ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలంతో పునీతమైన పుణ్య భూమి నా దేశం !
స్వేచ్ఛా ప్రజాపాలన కోసం ప్రాణాలను వాయువుల్లో వదిలిన నా వారస భారతదేశం!!
నిలువెత్తు నిగ్రహాన్ని వహించి ఆదర్శమైన మా దేశం!
అన్ని గణాలతో, సంపూర్ణ అధికారాలతో,అందరిని కలుపుకుని పోయే నా రాజ్యాంగ వ్యవస్థ దేశం భారతదేశం!!
అవస్ధలను పోగొట్టే నాదేశం !ఏ దేశంతో నైనా తట్టుకుని నిలబడే మనదేశం!! పరిపూర్ణ భాగోద్యయ దేశం! నా దేశం!!
రచన..సయ్యద్. హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ) కావలి .