Type Here to Get Search Results !

శివపురాణ సంగ్రహ - బిల్వపత్ర నియమాలు

0

 శివపురాణ సంగ్రహ - బిల్వపత్ర నియమాలు


 త్రిదళం త్రిగుణాకారం 

 త్రినేత్రంచ త్రియాయుధం౹ 

 త్రిజన్మ పాపసంహారం 

 ఏకబిల్వం శివార్పణం౹౹ 


అందరికీ ఈ శ్లోకం తెలుసు. కానీ ఈ శ్లోకం యొక్క అర్థం ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. తెలియనివాళ్ళు ఉంటే తెలుసుకుంటారని దీని అర్థాన్ని చెప్పడం జరిగింది.


 త్రిదళం అంటే మూడు ఆకులతో కూడుకున్నది. మూడు ఆకులతో ఉన్నదాన్ని ఒక దళం అంటారు. మారేడు చెట్టు  ప్రతి కొమ్మకి మూడు ఆకులు చొప్పున దళాలు ఉంటాయి. ఆ విధంగా ఉండడం ప్రకృతి గొప్పతనం.


 త్రిగుణాకారం : మూడు ఆకులూ మూడు గుణాలు కలిగి ఉంటాయి.

త్రిదళంలో కుడివైపు విష్ణువు, ఎడమవైపు బ్రహ్మ, మధ్యలో శివుడు కొలువై వుంటారు.


 త్రినేత్రం : మూడు కన్నుల వాడు శివుడు. ఒక్కొక్క ఆకు ఒక్కొక్క కన్ను.


 త్రియాయుధం : అంటే త్రిశూలం


 ఏకబిల్వం శివార్పణం : పరమ శివుడికి ప్రీతికరమైనటువంటి బిల్వపత్రం ఒక దళం సమర్పిస్తే చాలు.


 త్రిజన్మ పాపసంహారం : మూడు జన్మలలో చేసుకున్నటువంటి పాపాలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి.


బిల్వపత్రములను (మారేడు) సోమ, మంగళ, శుక్ర వారములలోనూ, సంక్రమణం సమయంలోనూ, అసౌచ సమయంలో, రాత్రి సమయాలలోనూ కోయరాదు.


బిల్వదళమును శుద్ధ జలంతో కడుగుతూ పదిరోజులు వాడుకోవచ్చు. కానీ సోమవారం, ప్రత్యేకరోజుల్లో మాత్రం ముందురోజు చెట్టునుండి సేకరించిన వాటితో అర్చనచెయ్యాలి.


మారేడు దళానికి ముందుబాగంలో అమృతం, వెనుకబాగంలో యక్షులు వుంటారు. కనుకనే బిల్వపత్రం ముందుభాగం శివలింగంపై వుండేలా సమర్పించాలి.


ఓం నమః శివాయ🙏  మధు గురూజీ...స్వదేశీ విక్రయ కేంద్రం, సూర్యాపేట...

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages