Type Here to Get Search Results !

తను వలచిన మదిని కన్నులు తనివితీరా గాంచి

0

 



తను వలచిన మదిని కన్నులు తనివితీరా గాంచి 

ముసిముసి నవ్వులు వెదజల్లుతూ  

ఆ హృదయ రూపకోమల కమలాక్షుడు 

మనోహరమైన లీలారస సరస సుందరుడితో తన అలనాటి చిలిపి చేష్టలు, ముద్దు ముచ్చట్లు జ్ఞప్తికి చేసుకుంటూ ,

ఆ మధుర స్మృతులతో కలిగిన అనుభూతులను మన్ననం చేసుకుంటూ 

తన ఎదలోతుల్లో మురిపియంగా, మనస్సు లో దాగిన ప్రేమ విరబూయగా 

తన్మయత్వంతో తన తనువు గ్రీష్మ తాపం నొంద,

కంటి వెలగులు తేజోమయ  అరుణవర్ణ ప్రకాషితమై మైకం కాగా ,

ముత్యాల వంటి పళ్ళు జిగెల్ జిగెల్ మనగా ,పెదాలు సరదాగా చిరునవ్వుతో స్వగతాలను స్వాగతాలు  పలక ,

మనంబులోని మాట,పాటగా బయటపడి ఒళ్ళు ఆదమరచి అల్లరి చేస్తూ ఉంటే 

తన పక్కన వలచిన చెలికాడు లేక విరహంగా 

బాహుల్లో   ఆ తైల వర్ణ చిత్రాన్ని బిగి కౌగలిలో కౌగలించుకుని పలకరిస్తూ గుండెలపై హత్తుకుంటూ ఉంటే 

ఆ విరహపు దాహం  మోహంతో సన్నగిల్లి  పకపకనవ్వులతో మాయం మాయే 

ఏకాంతంలో పకపకనవ్వుల కాంత మదిలో దాగిన/ దాచిన అంతరాలు ఇలా మటుమాయం  అయ్యే.

రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ)కావలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages