లాక్ డౌన్ మంచిదే ఆకలిని నింపితే
లాక్ డౌన్ మంచిదే ధరలు నియంత్రణ చేస్తే
లాక్ డౌన్ మంచిదే సకాలంలో చికిత్స అందితే
లాక్ డౌన్ మంచిదే ప్రాణాలు నిలిపితే
లాక్ డౌన్ మంచిదే చదువులు సట్టుబండలు కాకుంటే
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-------------------------------------------------------
వసుధ న అంటి మానవాళిని కర్కశముగా కభళిస్తూ ;
నరజాతిని బలిచేస్తూన్న కరోనుడు ని కట్టడి చేస్తున్న వైద్య నారాయణుడు అపర ధన్వంతరిగా ;
తన తనువును ఆద మరచి తనవారిని ఏమార్చి నిరంతర సేవాకుడు ;
కరోనుడు సృష్టించిన మృత్యు సాగరాన్ని దాటించసాగే అది ఎట్లన్నన్!!
అలనాటి కంసుడి చెర నుంచి బాలకృష్ణుడను దాటించినట్లు ; వసుధపై వసుధైక కుటుంబాన్ని కాపాడుటకు ఈ వైద్య నారాయణుడు పడే పాట్లు అంత ఇంత కాదుయా!! కలి కాలాన కలి అవతార యుగపురుషుడుగా మారే;
ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపుబాట!!
-----------------------------------------------
కాయ పూర్తిగా పండనే లేదు పండి ఎండనే లేదు;
అది ఏమి విచిత్రమో కాయలో విత్తు సత్తువ అయి మొలకైంది!
ఇదేనేమో! చూడ చూడా!! మరో జ్ఞానానికి పునాది కావచ్చు నేమో!
ఇది చురకశ్రీ సూటిమాట!
స్వర్ణకాంతిపుంజపు బాట!!
