Type Here to Get Search Results !

నేను, నీవు ఒకటే ! కాలానికి సాధకులం! సమిధిలం వెలుగుతూ ,వెలిగిస్తూ ఆరిపోయే ప్రమిదలం...

0
నేను, నీవు ఒకటే !
నీవు వెలగ నప్పుడు నిగనిగలాడుతూ,
నే;నా పుట్టింట తిరుగాడునప్పుడు మిసమిసలాడుతూ; 
నిన్ను వెలిగించినా  కాంతిని ఇస్తూ వేడి సన్నటిధారల పరుగులు!!  
నా అందమైన సుకుమారమైన మెడలో పుస్తెలు పడ్డాక;  ఆనందమైన; తీపి గురుతుల తిరగలి తిరుగులు! 
కాస్తంత కాలం జరిగాక బరువు బాధ్యతలతో, 
నే; ఉక్కిరిబిక్కిరి నా అందచందాలు తరుగులు!
అలా;
నీలో సారం అయిపోతూంటే నీ నున్నని తలం వికారమైన  బొబ్బలు!! 
నాలో కూడా అంతే అంద విహీనమైన ముడతలు; తుదకు! నీవు చీకటిని చీల్చి!! వెలుగులు నింపి; నీవు రాల్చిన వేడి నీటిలో మునిగి ఆరిపోతావు!
నేను అంతే!! నా అవసరం అంతే!! 
నే; నా వారి కోసం పనిచేసి,చేసి అలసిసొలసి భువిలో కలిసిపోతాను !
అదే నీకు,నాకు ఆనందం, నిన్ను నీవు దహించుకొని ప్రకాశించావు!
నన్ను నేను ఆవహించుకొని ప్రజ్వలనం చేశాను!!
అందుకే ఇద్దరిది ఒకే ధరి!ఒకే దారి!! 
నీవు; నేను  కాలుతూ,కాలిపోతూ,కరిగిపోతూ,తరిగిపోతూ! 
ఒక వెలుగు, వెలుగుతూ,కర్తవ్యాన్ని పూర్తి చేస్తూ కదలిపోతాం! ఇంతటి భాగ్యం ఎవరికి కలుగు ‍ఇరువులం కాలానికి సాధకులం! సమిధిలం వెలుగుతూ ,వెలిగిస్తూ ఆరిపోయే ప్రమిదలం...
రచన...సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages