Type Here to Get Search Results !

చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట! :: 10

0

 పక్కవాడిని ఎలా పిలిచిన నీకు వికటాట్టహాసము, మహాసరదా, హిట్టు !అదేమిటో! 

అవే పలుకులంటే నీకు గిట్టవు!! అదే పెద్ద తిట్టు!! పౌరుషం ఉట్టిపడు!!; 

కట్టు తెంచుకుంటే ఆనకట్టైనా తెగిపోదా?

అందుకే అంటారు!దేనికైనా ఓ హద్దుపద్దుఉండాలని;వింటారా?

వినరు,అదుపు చేయాలి, చేయించాలి లేకుంటే! పదువులు ఉన్నా లేకున్నా పరువులు పరుగులు తీయు!!!

ఇది చురకశ్రీ సూటిమాట!స్వర్ణకాంతిపుంజపు బాట!!


-------------------------------------------


గెలవడానికి నొకప్పుడు జనాల  చప్పట్లు;

గెలవడానికి అప్పుడు జనాల సారాబుడ్డి తందానాల ఓట్లు!

గెలవడానికి అప్పుడప్పుడు నోట్ల కట్టల చిందులు!!

గెలవడానికి ఇప్పుడు కోట్ల నోట్ల వరద పొంగులు;

అదే హంగు,రంగు మారిన పద్ధతి మారకపోయే జనాల గతి శృతి ఎప్పుడు పోకపోయే

🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️🌶️

ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!


-------------------------------------------------------


సహజ నిజాన్ని గజపాదాల కింద అదిమి పదేపదే గోలచేస్తే అబద్ధం కాక చస్తుందా!

కల్తీ కాలంలో చిత్తకార్తి కంత్రీ మేధావులు ఉసిగొల్పి ఉన్నత శిఖారాన్ని చేరి !!

విర్రవీగే చిత్రవిచిత్ర బురద వెధవల్; బురదను ఎదుట వారిపై జాడించి పోదురు వరాహపుత్రుల్!

ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!


-------------------------------------------


దొడ్డిదారిన దూరినవాడు,అడ్డదిడ్డంగా రాకపోకలు సాగించకుండా ఉండునా? 

చెడ్డవాడు టింగరి పనులు చేయకుండా ఊరకుండునా? 

పెడసరి పసిడిపోకడల వెంటపడునా ధరణినందున్!

ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!


--------------------------------------------


నదీనాథులు,బహుళవరదలతో

జన సమూహాలు సమస్యల బురదలో!

వాద ప్రతివాదాలతో, రా..నాల నోటిదూలతో సభలు,సమావేశాలు,దద్దరిల్లుతూవృథాఅయిపోతుంటే!! 

ప్రగతి రధచక్రాలు ఎలా పరుగులు తీయు,నీతి నియమాలు జనాలు ఎలా నేర్చు అవని నందున్!

ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages