Type Here to Get Search Results !

చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!! :: 11

0

 రావడానికి ఏమైనా చెబుతాం,

లేవడానికి ఏదైనా పట్టుకుంటాం!

వినడానికి మీరు ఉంటారు,

లేపడానికి మీరే ఉంటారు!

మేము మీకు ఊడిగం అంటాం

చివరికి మీచేతే అదే చేయిస్తాం!

మంచి మాటలు, విధానాలు అంటాం, మా కొత్త సిద్ధాంతాలు గొప్పవి అంటాం! 

వాటికోసం చేసే రాద్ధాంతాలు మహా అద్భుత నాటకాలు,  

మీకు తెలియని పదజాలాన్ని పరిచయం చేయిస్తాం!!

సరికొత్త విధానాలతో వెగటుపుట్టు చేష్టాలు రికార్డులు అవే భజన జన రివార్డులు !

మా ఉన్నతికి అవే అవార్డులు!! పిచ్చి జనాలు మావెంట పరుగులు తీసేవరకు మేము పదిలంగా ఉంటాం! లేకపోతే శిధిలమైపోతాం!! 

ఇప్పటికైనా మేము ఎవరో తెలిసిందా! 

లేకుంటే కాస్త ఆలోచించండి మా భజన జనాలు! ఇకనైనా,మేలుకోండి!! మా గుణగణాలు తేటతెల్లం చేసాం, మీ వెలుగుబాటలు మేవే సుమా!  

ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!


----------------------------------------------


ఒకసారి చేయేత్తి చూడు!ప్రతిసారి  చేయిలేస్తుంది!!

అది దేనికైనా సరే;

ఒకసారి చేయి చాచి చూడు!

ప్రతీసారి చేయి చాచుడే!చాచుడే!!

అది ఎందుకైనా;

ఒకేసారి ఇచ్చిచూడు! 

ప్రతీసారి ఇచ్చుడే! ఇచ్చుడే!!

అది ఏదైనా సరే;

ఒకసారి గళం విప్పిచూడు!

ఎదుటివాడి స్వరం మూతపడు!!

అది ఏ సందర్భమైనా;

ఒకసారి తడబడితే; ఒరే! అబ్బి!! 

నీవు పోరాడలేవు!

తిరగబడలేవు! ఎదగలేవు!! నిలబడలేవు!!! 

నీ పతనం ఖాయం! నీవు ఖతం!!

ఇది నిజం! ఇదే నిజం!!

ఇది చురకశ్రీ సూటిమాట! స్వర్ణకాంతిపుంజపు బాట!!


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages