Type Here to Get Search Results !

నాకేమి కొత్త కాదు అలాగే నీకు కూడా కొత్తేమీ అంతకంటే కానేకాదు

0

 నాకేమి కొత్త కాదు 

అలాగే నీకు కూడా కొత్తేమీ అంతకంటే కానేకాదు

బాధలు భరించడం;

సమస్యల్లో ఉండడం;

వాటిని ఎదుర్కోవడం పరిష్క

రించుకోవడం! ఎందుకంటే ;

అవి ఎల్లప్పుడూ మనవెంటే అంటుకొని ఉండేవే!

వాటితోనే మన నిత్య సావాసం!! 

కష్టాలు అనుభవించడం; కన్నీరు కంటిలో దాచుకోవడం; వాటిని కంటి లోనే ఇంకింపచేయడం!

ఎందుకంటే అవికూడా విలువే!! మరి;

ఇతరుల కంట పడనీయక చూసుకోవడం; 

కొత్తేమి కాదు మనకు 

చులకన అయితే అదొక బెంగ మనకే మరి!

బాధలు పడుతున్న కష్టాలు అనుభవిస్తున్న; 

తీరా! తీరిపోయాక;

మనసుకు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు! 

సుఖం అనేది కలిగించే హాయి కాస్తే; 

అయినా!! 

దాని కోసంపడే తపన,ఆరాటం,పోరాటం ఎంతో!!

పొందినాక;

బొందిలో కదలిక ఆనందపు డోలిక!!

అవధులు లేని అనంత సరాగాలు! 

ఇవన్నీ;

నీలో నాలో నిరంతరం సాగే జీవన సరాగాలే!! 

అందుకే ఇవన్నీ నాకు నీకు కొత్తేమీ  కాదు!

అదే జీవితం అందులోనే జీవనపు మకరందం; 

సాఫీగా సాగితే దేని విలువ తెలియదు సుమా!!

రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్(చురకశ్రీ) కావలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages