Type Here to Get Search Results !

మనలో వాడిఉంది!వేడిఉంది!! మన పిడికిలి ఉక్కుసంకెళ్లు తెంచే శక్తి ఉంది!

0

మనలో వాడిఉంది!వేడిఉంది!! మన పిడికిలి ఉక్కుసంకెళ్లు తెంచే శక్తి ఉంది! 

సమస్య సాధనలో ఉక్కు సంకల్పపు యుక్తి ఉంది!! అందుకే.. రండి! రండి! రారండి!! తరలిరండి!! సోదరిసోదరులారా!!!...//రండి రండి//

ఉప్పెనలా ఉద్యమంలో ముందుకు దండిగా చేరండి! ఉద్యమ ఆసామీలా!! భాగస్వామ్యలై కదలిరండి!!! కొత్తగా పొందడంకోసం కానేకాదు ఉన్నది ఊడక కాపాడే ఆరాటం!  

హక్కులను నిలబెట్టుకునే  పోరాటం!! //రండి.. రండి....//

పతనం అవుతున్న జీవన ప్రమాణాలను ఒడిసి పట్టి, సిపియస్ సాధనకోసమే!ఇచ్చిన హామీలను  రాబట్టడంకోసం, లబ్దిపొందే పిఆర్సీ కోసమే ఈ సమరం! ఉద్యోగ సమరం!! 

అందుకే సమస్త వేతన జీవులారా! వెతలు తీరుటకోసం అన్నివదలి కదలిరండి!! ..//రండి...రండి..//


మీ అందరి అండదండలే ఉద్యమ విజయకేతానికి సంకేతం!! మీ కాళ్ళకదిలికలే

పోరుబాటై మన జయానికి విజయ బావుటా అందుకే వరదలా ఉప్పొంగి  పోరాటం చేద్దాం పోరాడితే పోయేది ఏముందిరా! శ్రమజీవుల సంకెళ్లు తప్ప!!//రండి.. రండి..//

పోరుబాటలో నడుము బిగించి నడిచి మభ్యపెట్టె ప్రభువుల భ్రమలు తొలగించి మన బతుకు సట్టుబండలు కాకుండా చేసుకుందాం రండి!రండి రారండి//రండి.. రండి...రారండి.....///

రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్ (చురకశ్రీ )కావలి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages