Type Here to Get Search Results !

పడమటి మరాఠీ రాజ్యం అట్టడుగు వర్గాల మహల్ వంశాన భీమాబాయ్

0




పడమటి మరాఠీ రాజ్యం అట్టడుగు వర్గాల మహల్ వంశాన

భీమాబాయ్,రాంజీమలోజీ పదనాలుగవ సంతానంగా ఉద్భవించిన సరస్వతి పుత్రుడా! ఓ!! భీమారావా!!!

 

నీ అసమాన ప్రతిభ అసమానతలు తొలగించుటకు అవతరించిన అభినవ బుద్ధుడా!!

 

బానిస సంకెళ్లు తెంచుటకు సమరశంఖం పూరించిన కలియుగ అర్జునుడా! ఓ!! స్వాతంత్ర్య సమరయోధుడా!!

 

అంటరానితన నిర్మూలనకు పోరాడిన అపరధైర్యపరుడా! బహువిద్యలు పొందిన న్యాయకోవిదుడా!!

 

బహుజనుల   బాధలు తీర్చడానికి పుట్టిన ఆశాకిరుణుడా!  అసమానతలు రూపుమాపుటకు ఉదయించిన దినకరుడా!

 

నీతి శాస్త్రాలు తెలిసి చుట్టి చట్ట పరిష్కారం చూపిన అపరచాణక్యపరుడా!

 

ఓ!! దళితబిడ్డ!! భరతగడ్డపై నీవు పుట్టి భరతమాత పునీతమైనదయ్యా!! ఓ "భారతరత్న" శేఖర్!! విజయడవూ! అయ్యావు అయ్యా!!

 

నీ గురువు పెట్టిన పేరు నిలబెట్టావయ్యా!

 ఓ! అంబేద్కర్ !!

 

దేశదేశాలు దేశదిమ్మరిగా తిరిగి తిరిగి నీవు రాసిన చక్కని గీతలే నేటికి పాలనకు రాత లైనయి అయ్యా!

 

అదే నయ్యా భారతీయ "పంచమ వేదం" "రాజ్యాంగం " అయిందయ్యా! ఓ! విలక్షణపరుడా!! నీవు సామాన్యడవు కావయ్యా! అసాధ్యుడవయ్యా!!

 

పాలకులు ఎవరు వచ్చిన నీ రాతలు మార్చలేరయ్యా! ఓ బాబాజీ!!! అందుకే నీవు ఇన్నర్ రూరల్!!

 

ఆ రాతలకు బలం ఉంది! బహుశక్తి ఉన్నదయ్యా!! అవే మాకు అందించిన సమ సమానత్వ హక్కులయ్యా!! ఓ! బారిష్టరయ్యా!! నీవు మాకు అమరుడవయ్యా!! ఓ అంబేద్కర్ య్యా!!

 

ఉన్నతభావాలున్న, సమర్ధత ఉన్న నిను లెక్కచేయనివారు లేకపోలేదయ్యా!

నీ పని నీవు ఆపలేదయ్యా! అదేనయ్యా నీ ఘనత!!

 

బాపూజీ, చాచాజీ,నేతాజీ, సర్దార్ జీ కలలుగన్న ప్రజారాజ్యంలో పయనించిన ఓ! బాబాజీ!!

 

నేటికీ, రేపటికి ఎప్పటికీ నీ ఆలోచనలు, చట్టాలు మాసిపోవులే! ఓ భరతమాత ముద్దు బిడ్డ!!!

 

నీవు నడించింది ముళ్ళబాటే! నీవు వేసింది పూలబాట!! బహుజనులకు వేసింది రాచబాట!!!

అందుకుంటే బహుజనులకు ఉజ్వల బంగారు బాటే!!!;

 

అందుకే నీవు సమతాబాట నిర్మాతవూ! ఓ బాబాజీ!!

అందుకే ప్రజాస్వామ్య పునాదులు పదిలం చేసావు చరిత్రలో సువర్ణ పుటలో నిలిచిపోతావయ్యా!!!

 


అంబేద్కర్ గారి వినతి

నా సంగతి సరేనయ్యా మన భరతమాత ముద్దు బిడ్డలారా!!

 అందుకే మీరు తప్పక చదవాలి!భరతమాత గర్వపడాలి.

అదే మీరు నాకు అందించే జన్మదిన శుభాకాంక్షలు...

ఇట్లు

మీ డాక్టర్ బి‌ఆర్.అంబేద్కర్

ఇండియా.



రచన..సయ్యద్ హయ్యూల్ హయ్యూమ్( చురకశ్రీ) కావలి, నెల్లూరు జిల్లా, చలనాభాషిణి.9493242241.







కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages