విలువైనది జీవితం
చేసుకొనుము సార్ధకం
వ్యర్ధమైన వాటితో
చేసుకోవద్దు శిథిలం
క్షణికావేశం నిప్పు
తెచ్చిపెట్టును ముప్పు
ఆత్మహత్య యోచనలు
విడిచిపెట్టుట ఒప్పు
జీవితం పోరాటం
కాదు కదా చెలగాటం
గొప్పగా జీవిస్తే!!
దొరుకు మహిమ కిరీటం
సమస్యలకు పరిష్కారం
తెలుసుకొనుట శ్రేయస్కరం
బలవంతపు మరణాలు
క్రుంగదీయు కుటుంబాలు
-గద్వాల సోమన్న ,
ఎమ్మిగనూరు,
సెల్:9966414580.
