Type Here to Get Search Results !

కాళోజీ ! నీకివే నా అసలైన నివాళులోజీ ! :: రుద్ర మాణిక్యం (కవి రత్న)

0

 నా కవితల అలిపిరి

*******   

కాళోజీ జయంతి రోజున నేను 

వినిపించిన కవిత.                    

శీర్షిక - కాళోజీ ! నీకివే  నా అసలైన నివాళులోజీ !

       """"""""""""""""""""""""""""""



భాషల పలుకు బడుల యాసలు ఎన్నో !

అందు తెలంగాణ తెలుగు యాస ఒకటి !


తెలంగాణ తెలుగు యాసల నిపుణ ఝరి

  ప్రజా కవి కాళోజీ కవనము !

ఆయన మనసును ఆకళింపు చేసుకుని

చేయవలెను మరి మరి స్మరణము !


నా గొడవ అంటూ తెలుగు కవనమును

       ఎటో తీసుకెళ్ళాడు !

  ఎందరికో పరిచయం చేస్తూ !

ఎందరి నోళ్ళలో మనుషులలో అవి 

                     నాటుకొని

పెనవేసి కొని ఉన్నవో కద ! ఓ కాళోజీ !

 నీకివె అసలైన నివాళులోజీ !

   ధన్యోస్మి యని తరింతును !

తెలుగు కవనమును ఆవాహనము 

  చేసుకొందు వీలైన వేళలలో !

వెల్లడి చేయుచు తెలుగు కవనమును

 ఆయా జాడలలో !

ఇది నా కవనపు శ్వాస ఊపిరి !

ఎదను తట్టి లేపెడి కవితల అలిపిరి !

 కవితల అలిపిరి !

   *******

రచన :--రుద్ర మాణిక్యం (✍️కవి రత్న) జగిత్యాల

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages