చిన్నిచిన్ని వాటికి
చిరాకు పడకూడదు
చింతలతో బ్రతుకును
చిదిమివేయకూడదు
క్షణికావేశం నిప్పు
తెచ్చిపెట్టును ముప్పు
అదుపు చేసుకుంటే
అందరిచేత మెప్పు
బలన్మారణాలు కాదు
ఎంత మాత్రం మంచిది
నూరేళ్ళ జీవితము
కాపాడితే శ్రేష్టము
చీమనైనా చూడు
నైరాశ్యమిక వీడు
బ్రతుకెంతో గొప్పది
ఆత్మహత్య తప్పది
-గద్వాల సోమన్న
