Type Here to Get Search Results !

చీకటి వెలుగును కప్పింది

0

  

చీకటి వెలుగును కప్పింది!

ఆ వెలుగు రేపటి చీకటిని వీడాలని ఎదురు చూస్తుంది!!

అవినీతి నీతిని పాతర వేసింది!

ఆ నీతి అవినీతిని ఏవగించుకుని ఏనాటికైనా తరుముతుంది!!

అసత్యం సత్యాన్ని దాచివేస్తుంది!

ఆ సత్యం అసత్యాన్ని దహించి పైకిలేస్తుంది!!

 అధర్మం ధర్మాన్ని నిర్దాక్షిణ్యంగా నాశనం చేస్తుంది!

ఆ ధర్మం కొరడా ఝరిపి అధర్మాన్ని తాటతీస్తుంది!!

కలత మమతను వేరుచేసింది!

ఆ మమత కలతను చెదరగొట్టితీరుతుంది!!

అసహనం సహనాన్ని రెచ్చగొట్టింది!

ఆ సహనం ఎప్పుడైనా విజయకేతనం ఎగురవేస్తుంది!!

మతి  గతి తప్పి  స్థిమితం కోల్పోయింది!

గమనంలో మతి గతిని స్ధిర స్ధితిని చేయున్ తధ్యం !!

ఇవే చురకశ్రీ వారి  మాటస్వర్ణ కాంతి బాట !!!

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages