అమ్మకు మీసం లేదు
నాకు ముద్దు పెడుతుంది
ఎంతో
మెత్త గుంటుంది...
నాన్నమ్మకు మీసం లేదు
నాకు ముద్దు పెడుతుంది
ఎంతో
మెత్త గుంటుంది...
తాతికి మీసం లేదు
నాకు ముద్దు పెడుతుంది
ఎంతో
మెత్త గుంటుంది...
తాతకు మీసం ఉంది
నాకు ముద్దు పెడతాడు
ఎంతో
గుచ్చు కుంటుంది...
నాకు మీసం లేదు
నేనే ముద్దు పెడతాను
ఎంతో
మెత్త గుంటుంది...
Social Plugin