Type Here to Get Search Results !

బడికి సాగుదాం

 


కలసి సాగుదాం - బడికి కదులుదాం

అలుపు సొలుపు మరచిపోయి

నడచి సాగుదాం!

కొండవాగు ఉరకలెత్తు మా అడుగులో

గుండె ఊసులెన్నో పొంగు ఈ బాటలో

కలసి పాడుదాం-బడికి సాగుదాం

చెట్ట పట్ట జట్టుకట్టి - కదలిసాగుదాం

తెలుగు పూలు రేకులెత్తి పరిమళించగా

వెలుగు బాట వికసించే పదం పాడుదాం

కలసి పాడుదాం-బడికి సాగుదాం

గట్టు పుట్ట మెట్టదాటి కదలిసాగుదాం

కలం యోధులెందరినో తలచుకొందము

విజ్ఞాన శాస్త్రవేత్తలను తెలుసుకొందము

తలపు పెంచుదాం - కలుపు తుంచుదాం

వెలుగు నీడ రాపిడిలో విలువ పెంచుదాం


చిత్త శుద్ధి, నమ్రతా వదిలి పెట్టము

నిరంతరం శ్రమచేస్తాం - బద్ధకించము

మాట తప్పము - తప్పి నడవము

బాటతప్పి బూకరిస్తె వదిలిపెట్టము

అడ్డమయిన బండరాయి మెట్టుచేసుకొని

ఎగుడుమెట్ల కుట్రల్ని రచ్చకీడ్చుదాం

చిన్న వాళ్ళందరికీ ఊతమిద్దము

చిన్న చిన్న అడుగులతో ముందుకెళ్దాము.

కదలి సాగుదాం - బడికి కదులుదాం

చదువు సార మెరిగి

బతుకు వెతలు చెరువన్నెల్లు

Show ad in Posts/Pages