Type Here to Get Search Results !

బంగారు ఆభరణాలు మెరుపు పోకుండా ఏవిధముగా జాగ్రత్త పడాలి?

0

 


లోషన్లు , పౌడర్లు , మురికి వంటి వాటికారణముగా బంగారు ఆభరణాల పై నెమ్మదిగా పల్చని పొరలాంటిది ఏర్పడి మెరుపు తగ్గిపోతూ ఉంటుంది . తగిన జాగ్రత్తలు ద్వారా మెరుపును తిరిగి తీసుకురావచ్చును .

 

* ఒక పాత్రలో సగం దాకా గోరువెచ్చని నీరు పోసి రెండు టేబుల్ స్పూన్లు వాషింగ్ లిక్విడ్ కలిపి ఆభరణాలను 30 నిముషాల సేపు నానబెట్టి టూత్ బ్రెష్ తో సున్నితముగా బ్రెష్ చేయాలి . గోరువెచ్చని నీటిలో కడిగి మెత్తని కాటన్‌ గుడ్డ తో తుడవాలి. ఇలా నెలకొకసారి చేస్తే సరిపోతుంది .

 

* అమ్మోనియా + నీరు సమపాళ్ళలో తీసుకుని ఆభరణాలను 20 నిమిషాలు నానబెట్టి టూత్ బ్రెష్ తో స్క్రబ్ చేయాలి. ట్యాప్ కింద కడిగి వస్త్రము తో తుడవాలి.

 

* స్కికా ఉండే టూత్ పేస్ట్ తో ఆభరణాలు క్లీన్‌ చేయకూడదు . సిలికా వల్ల మెరుపునిచ్చే ఫినిషింగ్ దెబ్బతింటుంది . కొంతకాలానికి బంగారు ఆభరణల వన్నె తగ్గిపోయి పేలవం గా కనిపిస్తాయి.

 

* చింత పండు రసములో బంగారు ఆబరణాలు 30 నిమిషాలు నానబెట్టి ... టూత్ బ్రెష తో క్లీన్‌ చేసి మెత్తటి గుడ్డ తో తుడిస్తే దగదగ మెరుస్తా్యి . దీనిలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వలన మురికి పోయి బంగారము మెరుస్తాయి




కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages