ఒక రోజు మహారాణి, మహారాజూ తమ మందిరంలో కూర్చుని వుండగా, వీణాధరి వింజామర వీస్తున్నది. అప్పుడు ఒక గూఢచారి అక్కడికి వచ్చి, “మహారాజా! వైదేహిరాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయుత్త పరిచాడు. ఆది ఏ క్షణాన అయినా జరగవచ్చు” అని చెప్పి వెళ్ళిపోయాడు.
యుద్ధవార్త వినగానే వీణాధరి భయంతో పంపిస్తూ, వింజామార వీచడం మరిచిపోయింది. మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది.
మహారాజు, ఆమెతో, “శక్తిసింహుడు దాడి చేయవచ్చు గాని, అది అకస్మాత్తుగా మాత్రం కాదు. అతడు దాటవలసిన స్వర్ణముఖి నడీ తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలోనే వుంది!” అని వీణాధరి కేసి తల తిప్పి చూసి, “అంతః పురంలోని వాళ్ళే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే, ఇక సామాన్యులు మాటేమిటి? ధైర్యంగా వుండడం నేర్చుకో.” అన్నాడు.
ఒక నాడు రాణి చంద్రావతి వనవిహారానికి బయలుదేరింది. ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు. అయితే, వీణాధరి మాత్రం శిరోవేదన నెపం పెట్టి తప్పించుకున్నది. అందుకు కారణం – మహారాణి లేనప్పుడు, ఆమె నగలు అలంకరించుకుని, అద్దంలో చూసుకోవాలన్న కోరిక, వీనాదరికి చాలా కాలంగా వున్నది.
మహారాణి వనవిహారానికి వెళ్ళగానే వీణాధరి, ఆమె పట్టువస్త్రాలు, నగలు ధరించి, అద్దం ముంది నిలబడింది.
అంతలో ఒక యువకుడు, అక్కడికి వచ్చాడు. అతడు వీణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది, “సుందరీ! ఎవరు నువ్వు?” అని ప్రశ్నించాడు.
సాధారణమైన దుస్తులు ధరించివున్న, ఆ యువకుణ్ణి చూసి వీణాధరి, అతణ్ణి ఆటపట్టిన్చాలనుకుని, “నేను శక్తిపురి రాజ్య యువరాణిని. ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను” అన్నది హుందాగా.
అందుకు యువకుడు, “నేను రాజ్యం యువరాజు విజయదీపుడిని. విద్యాభ్యాసం ముగించుకుని, ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను. నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుదిని చేసింది. నీకు సమ్మతమైతే, పెద్దల అంగీకారంతో మన వివాహము జరిగేలా చూస్తాను,” అన్నాడు.
ఇది విని వీణాధరి, తను పరిహాసమాదించిన యువకుడు సాక్షాత్తు యువరాజేనని గ్రహించించింది. మరుక్షణం ఆమె విజయదీపుడి పాదాలకు నమస్కరించింది. “యువరాజులు క్షమించాలి! నేను మహారాణి పరిచారికను. మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్తచాన్చాల్యముతోనూ, మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను. నా తప్పు క్షమించండి!” అని వేడుకున్నది.
నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వుతో, “భయపడకు! నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించాలనేగాని కాలదన్నిపోను. నువ్వు పరిచారికవైనా, పరిణయమాడ దలిచాను.” అన్నాడు.
ఆ మాటలతో తేరుకున్న వీణాధరి, “యువరాజా! మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నేను వివాహానికి సమాతిన్చాకపోతే, ఏం చేస్తారు?” అన్నది.
ఆ ప్రశ్నకు విజయదీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయాడు. “యువరాజంత వాణ్ణి అడిగితె, ఏ యువతి కాదనగలడు? నువ్వు అంగీకరించకపోతే, అందుకు కారణం నువ్వు వట్టి ఆహాన్కారివైన అయి వుండాలి, లేదా మూర్ఖురాలైనా అయి వుండాలి. అలా అయిన పక్షంలో నేను, నిన్ను మించిన అందగత్తెను వివాహమాదగాలను.” అన్నాడు.
ఆ వెంటనే వీణాధరి, “క్షమించండి, యువరాజా! నేను మిమ్మల్ని వివాహమాడలేను. కారణం, వివాహం మరొకరితో, ఏనాడో నిశ్చయమైపోయింది.” అని అక్కడ నుంచి బయలుదేరి, గ్రామచేరి, తనను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది.
బేతాళుడు ఈ కథ చెప్పి, “రాజా, వీణాధరి చిన్నప్పటి నుంచీ రాజకుమారుడిని వివాహమాడాలని కలలు కన్నది కదా! ఆ కళలు నిజమవుతున్న క్షణంలో, చేజేతులా జారవిడుచుకోవడానికి కారణం ఏమిటి? తను ఒక దేశం రాణి కావడానికి అనర్హురాలని గ్రహించడం వల్లనా? మహారాణి, ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది. మహారాజు, ఆమెకు ధైర్యంగా వుండడం నేర్చుకోవాలని గట్టిగానే చెప్పాడు. ఇది జరిగాక, వీణాధరి తన స్థాయికి, శక్తిసామర్థ్యాలకు మించిన కార్యం సాధించావూనానని గ్రహించి ఉంటుందా? ఈ సందేహాలకు సమాధానము తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది.” అన్నాడు.
దానికి విక్రమార్కుడు, “వీణాధరి, యువరాజును తిరస్కరించడానికి అవేవీ కారణాలు కావు. ఆమె తను కన్నా కళలు వాస్తవం చేసుకున్నాక, ఇక స్థాయి, శక్తిసామర్థ్యాలు ప్రసక్తే వుండదు. ఆమె, యువరాజును అడిగిన ప్రశ్నకు ఆటను ఇచ్చిన జవాబే, ఆమె అతణ్ణి వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం. వీణాధరి తనతో వివాహమంగీకరించాకపోతే – ఆమెను మించిన మరొక అందగత్తెను వివాహమాదగాలనన్నాడు, యువరాజు. దీని అర్ధమేమిటంటే – ఏదో ఒకనాడు వీనధరిని మించిన సౌందర్యవతి కంట బడితే, యువరాజు ఆమెను భార్యగా చేసుకోగలదు. అప్పుడు వీణాధరి పరిస్థితి హీనమైపోతుంది. ఇది ఆలోచించే, ఆమె తన పగటికలలకు స్వప్తి చెప్పి, తననేన్తగానో ప్రేమిస్తున్న, తండ్రి స్నేహితుడి కొడుకైనా శివుణ్ణి వివాహమాడింది.” అన్నాడు.
రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే, బేతాళుడు శవంతో సహా మాయమై, తిరి చెట్టెక్కాడు.
Source: Chandamama, July 1992.