Type Here to Get Search Results !

దండం దశగుణం భవేత్

0

 


దండిస్తేకాని పనిజరగదు అనే సందర్భంలో "దండం దశగుణ భవేత్" అంటూంటారు. దేవుడికైనా దెబ్బేగురువు అంటే కొడితేగాని పనిజరగదు అని భావం. కానీ ఆ వాక్యం అసలు అర్థం అదికాదు...

అసలు అర్థాన్ని ఈ శ్లోకంలో  పూర్తిగా చూద్దామా....

 

విశ్వామిత్రా హి  పశుషు

కర్దమేషు జలేషు చ

అంధే తమసి వార్ధక్యే

దండం దశగుణం భవేత్

 

ఇది శ్లోకం మరి దీనిలోని అర్థం -

1. వి - పక్షులు,

2. శ్వా - కుక్కలు,

3. అమిత్ర - మిత్రులుకానివారు(శత్రువులు),

4. అహి - పాములు,

5. పశు - పశువులు,

6. కర్దమేషు - బురదలో,

7. జలేషు - నీటిలో,

8. అంధే - గుడ్డితనంలో,

9.తమసి - చీకటిలో,

10. వార్ధక్యే - ముసలితనంలో

 

దండం - కర్ర,

దశగుణం - 10 గుణాలను, భవేత్ - కలిగిస్తుంది.

అంటే

కర్ర పక్షులను, కుక్కలను, శత్రువులను, పాములను, పశువులను అదుపు చేయడానికి, బురదలోను,  నీటిలోను,  గ్రుడ్డితనంలోను, చీకటిలోను, ముసలితనంలోను ఆపుగా(ఆసరాగా)ఉంటుంది. కావున కర్ర ఈ పది రకాలుగా ఉపయోగపడుతుంది - అని భావం.

Tags

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

Top Post Ad

Bottom Post Ad

Show ad in Posts/Pages