అన్నీ పంజరాలే!
అన్నీ పంజరాలు
, నువ్వే నీ చుట్టూ కట్టుకున్నవి
నిన్ను ప్రతింబింబించని
అద్దాల్లో ఇమిడిపోయావు
పచ్చికపై ఎప్పుడు
నడిచావో
ఉషోదయాలెప్పుడు
చూశావో
అకాశాన్ని అబ్బురపడుతూ
గమనిస్తూ
రాలిపడే తారలను
కనుగొన్నావో లేదో
ఒక నిర్మలమైన
రాత్రి
నీలోకి నువ్వు
తొంగి చూసుకున్నావో లేదో
అన్నీ పంజరాలే
, నీకు నువ్వు కట్టుకున్నవే
అక్కడే అందులోనే
స్వేఛ్ఛగా విహరిస్తున్నావు
ప్రకృతి నీవు
వేరు కాదనీ మమేకమవ్వమనీ
ఆహ్వానించేదెవ్వరు
?
నిన్ను బంధించినదెవరు? నీ మోహం తప్ప
నిన్ను విడిపించేదెవ్వరు
, నువ్వు తప్ప
--శ్రీనివాసమౌళి