పుడమిసిరులకి
పులకరించని మనసులెందుకు దండగ!
స్వార్ధచింతన
వదలకుంటే సంప దెందుకు దండగ!
చెంగుచెంగున గెంతులేసే
లేడిపిల్లకి దాహమైతే
గొంతు తడపని కొండవాగుకి
దూకుడెందుకు దండగ!
దేశరక్షణ కొమ్ముకాసే
సైన్యముండగ
గాయపడితే
చేయి కలపగ తోడునిలవని
రాజ్య మెందుకు దండగ!
చీకటింట్లో దివ్వెలాగా
చిట్టిగుండెలొ
నిండిపోగా
కలలునిజమై చెలిమిపంచగ
కలలకెందుకు దండగ!
సందెపొద్దున నేలతల్లికి బొట్టుపెట్టే జాబిలమ్మే
కవుల మదిలో నిలవకుంటే
కల్పనెందుకు దండగ!
------సేకరణ