ఈ రోజు ఏ కథ రాయాలి అనుకుంటున్న టైములో భద్ర గారు మంచి సలహా ఇచ్చారు – ఈ బ్లాగ్లో కొన్ని విక్రమార్కుడు-బేతాలుడు కథలు కూడా జేర్చమని.
చిన్నప్పుడు చందమామలో ఎంతో ఇష్టంగా చదివే వాళ్లము. దూరదర్శన్ వారు కూడా ఈ కథలును సీరియల్ గా చూపించేవారు. వారమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ, ఆ టైములో కరెంటు పోకూడదని గట్టిగా ప్రార్థిస్తూ వేచి చూసే వాళ్లము. ఇప్పుడు 100 చానెల్స్, వెయ్యి సీరియల్స్ చూసే జనరేషన్కి ఆ innocent pleasure అస్సలు అర్ధం కాకపోవచ్చు.
కానీ ఈ కథలు ఉత్తి వినోదం కోసమే రాసినవి కాదు. ఈ చిన్న కథలలో పెద్ద నీతులు దాగి వుంటాయి. భారతీయ సంస్కృతిలో పురాణ కథలలో వినోదంతో పాటు విద్యా, విజ్ఞానం కూడా వెదజల్లడం మామూలు విషయం. అందుకే “వెన్నతో పెట్టిన విద్య” అనే పదానికి అంత లోతైన అంతరార్ధం వుంది. నిన్న చూసిన సినిమా ఇవాళ గుర్తు వుండదు. కానీ ఈ కథలు? ఎన్నో యుగాలుగా గుర్తుండి పోయినవి.

విక్రం-బేతాళ్ కధలు దాదాపు 2500 సమత్సరాల క్రిందట మహాకవి సోమదేవ్ భట్ట సంస్కృతంలో వ్రాసిని “బేతాల్ పచ్చీసి” పై ఆధారించబడినవి. పచ్చీసీ అన్న పేరుబట్టి మొదటిలో ఇవి 25 కథల ద్వారా తెలియచేసిన నీతులని నమ్ముతారు. చందమామ magazine వల్ల popular culture లో చోటు చేసుకుని, చాలా భాషలలోకి అనువదించబడ్డాయి. విక్రమార్కుడు, బేతాళుడు ముఖ్య పాత్రల ఆధారంగా కొన్ని వందల కథలు రాసారు.
ఉజ్జయిని మహారాజు విక్రమార్కుడు తెలివైన వాడని, అనుభవగ్నుడని, అసమాన విజ్ఞాన విచక్షణ గల వాడని పేరు చెందాడు. ఆయన రాజనీతి, యుక్తి, సమస్యస్ఫూర్తి మూలంగా ఆ యుగంలో బాగా ప్రఖ్యాతి చందేరు.
విక్రమార్కుడికి రోజు ఒక యాచకుడు ఒక పండు పంపించేవాడట. ఆ పండు కొస్తే, అందులో రోజూ ఒక మణి వుండేది. ఈ విషయం ఆశ్చర్యజనకంగా అనిపించి రాజుగారు ఆ యాచకుడిని కలవాలనుకున్నారు. యాచకుడు నెలలో 14వ రోజున అర్ధరాత్రి ఒక స్మశానంలో వంటరిగా వస్తే కలుస్తానని కబురు పంపించాడు. ఈ వింత ఏంటో తనే తెలుసుకోవాలని విక్రమార్కుడు యాచకుడిని కలిసాడు. ఆ యాచకుడు ఒక చెట్టుమీద వేళ్ళాడుతున్న ఒక శవాన్ని తీసుకుని రమ్మని, ఇలా చేస్తే యాచకుడికి అపారమైన క్షుద్ర శక్తి వస్తుందని యాచించాడు. వెతికి తీసుకుని వస్తానని మాట ఇచ్చాడు విక్రమార్కుడు.
అలా చెట్టుమీంచి దింపిన శవంలో బేతాళుడు వున్నాడు. బేతాళుడు విక్రమార్కుడితో ప్రయాణం చేయడానికి ఒప్పుకుంటాడు కాని, ఒక్క నిబంధన పెడతాడు. దారిలో విక్రమార్కుడు మాట్లాడ కూడదు. దీనికి విక్రమార్కుడు ఒప్పుకుంటాడు.
ఇలా తీసుకుని వెళ్తుంటే బేతాళుడు చిన్న కథ చెప్పి, అందులో ఒక క్లిష్టమైన ప్రశ్న అడుగుతాడు. దానికి జవాబు తెలిసినా నోరు మెదలకపోతే విక్రమార్కుడి తల బద్దలైపోతుందని హెచ్చరిస్తాడు. విక్రమార్కుడు జవాబు చెప్తే బేతాళుడు మౌనభంగం కలిగినందుకు శిక్షగా మళ్ళీ తన చెట్టు మీదకి యెగిరి వెళ్లి పోతాడు. అలాగని చెప్పకపోతే తల నరికేస్తాడు.
ఇలాంటి పరిస్థితిలో ప్రతి సారి విక్రమార్కుడు జవాబు చెప్తాడు, బేతాళుడు శవంతో పాటు యెగిరి పోతాడు