చమత్కార పద్యం
కూరగాయ కృతం
త్రాసం, పాలనేతి
గవాం ప్రియం
అంబలి ద్వేషిణం వందే, చింతకాయ శివ
ప్రదం
తా:--తెలుగు పదాలతో కూడి
వున్న ఒక చమత్కార శ్లోకం యిది.
పాలు,నేయి, అంబలి, చింతకాయ
అనే పదాలు తెలుగు పదాలు.
అయితే ఆ పదాలను సరిగా
విడదీస్తే సంస్కృత
పదాలుగా మారిపోతాయి.
మరి ఒకసారి
పరిశీలిద్దామా?
ఇది విష్ణుమూర్తి యొక్క
ప్రార్థన.
కూరగాయ కృతం త్రాసం; కు=
చెడ్డ, ఉరగము =పాము
కుత్సితమైన ఆలోచనలుగల
కాళీయుడనే నాగరాజును కృష్ణావతారంలో మర్దనం గావించి భయాన్ని . కలిగించినవాడికి
వందే=నమస్కరించుచున్నాను.
అని అర్థం.
'పాలనేతి
గవాం ప్రియం' ఇక్కడ పాలు,నేయి అనే అర్థం కాదు.
పాలనే అతి అని
విడదీసుకోవాలి
గవాం పాలనే అతి ప్రియం
=ఆవులను కాపాడడం అంటే చాలా ఇష్టపడే వాడు.
కృష్ణావతారం లో గోసంరక్షణ
గావించాడు.
అతనికి నేను నమస్కరించు
చున్నాను.
అంబలి ద్వేషిణం అన్నప్పుడు
అం =విష్ణువు, బలి
ద్వేషిణం అని విడదీసుకోవాలి
బలిని ద్వేషించినవాడికి
నమస్కరించు చున్నాను.అని అర్థం.
చింతకాయ శివప్రదం అన్న
వాక్యంలో...
చింతన అంటే ఆలోచనచేసే ,ధ్యానించే
. చింతకుడు.
విష్ణువును గూర్చి
ఆలోచించే వాడికి శుభాన్ని కలిగించేవాడికి నమస్కరించు చున్నాను.